సంతోషం పట్టలేక...బట్టలు విప్పేసి..
స్పెయిన్ , ఏప్రిల్ 15
కరోనా వైరస్ వ్యాప్తిని ఆపేందుకు దేశాలన్నీ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రజలు మాత్రం మాట వినకుండా పోలీసులను విసిగిస్తున్నారు. ఇష్టానుసారంగా రోడ్లపై తిరుగుతూ కరోనాను అంటించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. డాక్టర్లు, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా సేవలు అందిస్తుంటే.. ఆకతాయిలు మాత్రం ఎలాంటి బాధ్యతలేకుండా వ్యవహరిస్తూ కరోనా వైరస్‌ను మరింత వ్యాపిస్తున్నారు. ఫలితంగా లాక్‌డౌన్ ముగింపు తేదీలను పొడిగించాల్సి వస్తోంది.ప్రపంచంలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న దేశాల్లో స్పెయిన్ కూడా ఒకటి. దీంతో ప్రభుత్వం అక్కడ లాక్‌డౌన్ ఖచ్చితంగా అమలు చేస్తోంది. అవసరం లేకుండా బయట తిరిగేవారిని అదుపులోకి తీసుకుని కోర్టుకు అప్పగిస్తోంది. టర్రెమొలినాస్‌లోని కోస్తా డెల్ సాల్ రిసార్ట్‌లో నివసిస్తున్న 41 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. లాక్‌డౌన్ ఉల్లంఘనకు పాల్పడటమే కాకుండా చుట్టుపక్కల ప్రజలను విసిగిస్తోందనే కారణంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టుకు అప్పగించారు.కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె సంతోషం పట్టలేక బయటకు వచ్చింది. ‘‘నన్నే అరెస్టు చేస్తారా??’’ అంటూ పోలీస్ కారు పైకెక్కిన ఆమె దుస్తులన్నీ విప్పేసి, మధ్య వేలు చూపిస్తూ డ్యాన్స్ చేసింది. లాక్‌డౌన్‌పై నిరసన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు ఆమెను లాఠీ కాళ్లపై కొట్టి కిందికి దించారు. అనంతరం అంబులెన్సులోకి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆమె బెయిల్‌ను రద్దు చేసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. ఆమె చిందులను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది.