YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ప్రాణాలు మీదకు వచ్చిన అక్రమ సంబంధం

ప్రాణాలు మీదకు వచ్చిన అక్రమ సంబంధం

ప్రాణాలు మీదకు వచ్చిన అక్రమ సంబంధం
హైద్రాబాద్, ఏప్రిల్ 15
అక్రమ సంబంధం వ్యవహారం ఓ వ్యక్తి ప్రాణం మీదికి తెచ్చింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తి పక్కింట్లో ఉండే యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరులో మంగళవారం జరిగింది. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి రెండు నెలలుగా జె.కొత్తూరుకు వలస వచ్చాడు. అక్కడే పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి ఇంటికి ఎదుటే గల్లా ఉమామహేశ్(20) అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు.తన భార్య ఆ యువకుడితో మాట్లాడటం ఆ వ్యక్తి అనేకసార్లు చూశాడు. దీంతో ఉమామహేశ్‌ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు అనుమానం పెంచుకున్నాడు. మంగళవారం తన భార్యతో ఆ యువకుడు మాట్లాడటం చూసిన ఆ వ్యక్తి కోపోద్రిక్తుడయ్యాడు. కత్తితో మహేశ్‌పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. కేకలు వేసుకుంటూ పరుగు పెడుతున్న బాధితుడిని చూసిన స్థానికులు అతడిని కాపాడి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జగ్గంపేట పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Related Posts