YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆరోగ్యం దేశీయం

తబ్లిగి...కధా కమామిషు...

తబ్లిగి...కధా కమామిషు...

తబ్లిగి...కధా కమామిషు...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15
తబ్లిగి …. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని గురించే చర్చ నడుస్తోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దీని ప్రకంపనలు వెలువడుతున్నాయి. ఈ సంస్ధ కార్యకలాపాలపై ఆసేతు హిమాచలం ఆందోళన చెందుతుంది. ఈ నెపద్యంలో ‘తబ్లిగి’ సంస్ధ పూర్వాపరాలు, దాని కార్యక్రలాపాలు, వ్యవహారశైలిపై అంతటా ఆసక్తి నెలకొంది. ‘కరోనా’ విస్తృతికి ‘తబ్లిగి’ కారణమన్న ఆరోపణలపై దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఆ సంస్ధ కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాని విశ్వసనీయతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఆ సంస్ధ గత నెలలో నిర్వహించిన మతపరమైన కార్యక్రమానికి వెళ్ళివచ్చిన వారి ద్వారా ‘కరోనా ‘ ఉభయ తెలుగు రాష్టాల్లో ప్రస్తుత పరిస్ధితి ‘తబ్లిగి’ కారణమన్న వాదనను విస్మరించలేం.తబ్లిగి జమాత్’ అంటే అల్లా ప్రవచనాలను, బోధనలను, సూక్తులను తెలియజేసే సంస్ధ. ఈ సంస్ధ నిర్వహించే సమావేశ స్ధలాన్ని ‘మర్కజ్’ అని వ్యవహరిస్తారు. ఈ ప్రాంతం దేశ రాజదాని డిల్లీలోని ‘నిజాముద్ధీన్’ ప్రాంతంలో ఉంది. డిల్లీలోని ప్రముఖ రైల్వేస్టేషన్ లో ఇది ఒకటి. దక్షిణాది రాష్ట్రాల నుంచి పలు రైళ్ళు నిజాముద్దీన్ కు నడుస్తుంటాయి. హైదరాబాదు నుంచి కుాడా ఒక రైలు ఉంది. దీనినే ‘దక్షిణ్ ఎక్స్ ప్రెస్’ అని హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ అని వ్యవహరిస్తారు. ఈ రైలు నిత్యం హైదరాబాద్ నుంచి డిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ కు ప్రయాణిస్తుంది.గత నెలలో ‘తబ్లిగిజమాత్’ నిర్వహించిన కార్యక్రమంలో ఎనిమిది వేల మందిపైగా పాల్గొన్నట్లు అంచనా. ఇందులో పాల్టొన్న పలువురిలో ‘కరోనా’ లక్షణాలు వెలుగు చుాడటంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. మర్కజ్ లో పాల్గొన్న పలువురు తమ స్వరాష్టాలకు రావడంతో ఆయా ప్రాంతాల్లో ‘కరోనా’ వ్యాప్తి ఉద్ధృతమైంది. అక్కడినుంచి వచ్చిన వారిలో పలువురు వైద్య పరీక్షలకు మెుండికేస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. వారిని వైద్య పరీక్షలకు ఒప్పించడం వైద్య, పోలిస్ అధికారులకు శక్తికి మించిన పనిగా మారింది. సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం వారు వైద్యపరీక్షలకు వెళుతుండటం ఆశావాహ పరిణామంగా పేర్కోనవచ్చు.హర్యానాలోని ‘మేవాట్’ ప్రాంతంలో 1927 లో ‘తబ్లిగి జమాత్’ సంస్ధ ప్రారంభమైంది. మౌలానా ఇలియాస్ కాంద్లావి దీని వ్యవస్థాపకుడు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గా సమీపంలోని ‘మర్కజ్’ ప్రధాన కేంద్రం. ప్రప్రంచ వ్యాప్తంగా ఇస్లాం బోధనలను ప్రచారం చేసే ఈ సంస్ధ దాదాపు 200 కు పైగా దేశాల్లో విస్తరించింది. సుమారు పాతిక కోట్ల మంది ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా దీనిని అనుసరిస్తారని అంచనా. భారత్ లోని వివిధ ప్రాంతాల్లో ఈ సంస్ధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఏటా జరిగే కార్యక్రమానికి సుమారు లక్షమంది ముస్లింలు హాజరవుతారు. ఢిల్లీ, మహారాష్ట్ర ల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా గల ముస్లింలు హాజరయ్యేందుకు వీలుగా ఏడాది ముందుగానే దీని షెడ్యూల్ ను నిర్ణయిస్తారు. గతనెలలో నిర్వహించిన కార్యక్రమానికి ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల ముస్లింలు హాజరయ్యారు. ‘తబ్లిగీ’ కార్యకలాపాలపై అనుమానాలు లేకపోలేదు. ఉగ్రవాద సంస్ధ ఆల్ ఖైదాతో దీనికి సంబంధాలున్నాయని 2011 లో ‘వికీలిక్స్’ సంస్ధ ఆరోపణలు చేసింది. ఉగ్రవాదులకు డబ్బు, వీసాలు అందిస్తున్న ఆరోపణలను తబ్లిగీ ఖండించింది. 2016 హర్యానా లోని ‘మేవాట్’ లో అరెస్టయిన ఆల్ ఖైదా ఉగ్రవాదికి ఈ సంస్ధలతో సంబంధాలున్నట్లు వార్తలు వచ్చాయి. తబికిస్ధాన్, ఉజ్బెకిస్ధాన్, రష్యా, ఈ సంస్ధను నిషేధించాయి. ఈ నేపధ్యంలో భారత్ ప్రభుత్వం అప్రమత్తమై నిఘాను విస్త్రతం చేసింది. భారత్ లో కూడా తబ్లిగిపై నిషేధం విధించే ఆలోచనను కేంద్ర ప్రభుత్ం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related Posts