ఇండియా లో సుమారు 5 లక్షలు ఫైగా పేస్ బుక్ ఖాతాలా డేటా ను కేంబ్రిడ్జి అనలిటికా వాడుకుంది అని పేస్ బుక్ వెల్లడించింది. గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ లిమిటెడ్ కి సంబదించిన అలెగ్జాండర్ తయారుచేసిన యాప్ ద్వారా కేంబ్రిడ్జి అనలిటికా ఈ డేటా ను సంపాదించింది. భారత ప్రభుత్వం పంపిన నోటీసులకు పేస్ బుక్ అధికార ప్రతినిధి స్పందించారు. మా అనుమతి లేకుండా డేటా ని వాడుకోవడం ఉల్లంఘనే అవుతుంది అని అన్నారు. తమ వైపు నుంచి తప్పు జరిగినా, తనకు మరో అవకాశం ఇవ్వాలని పేస్ బుక్ సీఈఓ జుకెర్ బర్గ్ కోరారు.