YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

భద్రాచలంలోనూ ఆన్ లైన్ సేవలు

భద్రాచలంలోనూ ఆన్ లైన్ సేవలు

భద్రాచలంలోనూ ఆన్ లైన్ సేవలు
ఖమ్మం, ఏప్రిల్ 15 
 భద్రాచ‌లం శ్రీసీతార‌మ‌చంద్ర స్వామివారి దివ్య‌క్షేత్రంలో రామయ్య పూజ‌లు ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవ‌చ్చు. ఈ సౌక‌ర్యాన్ని త్వ‌ర‌లోనే అందుబాటులోకి తెస్తామ‌ని దేవ‌స్థానం అధికారులు చెబుతున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాపిస్తున్న నేప‌థ్యంలో అంత‌రాయ‌లంలోకి భ‌క్తులెవ‌రినీ అనుమ‌తించ‌డం లేదు. ఆర్జిత సేవ‌ల‌ను, నిత్య‌క‌ల్యాణాల‌ను నిలిపివేశారు. దీంతో స్వామివారి ఆదాయానికి భారీగా గండి ప‌డింది. స్వామివారికి నిత్య కైంకర్యాలు య‌థావిధిగా అర్చ‌కులు నిర్వ‌హిస్తున్నారు. శ్రీరామ‌న‌వ‌మి, ప‌ట్టాభిషేక మ‌హోత్స‌వాలు కూడా నిరాడంబ‌రంగా జ‌రిగాయి. ఈ యేడాది సుమారు రెండు కోట్ల రూపాయ‌ల అంచ‌నాల‌తో శ్రీరామ న‌వ‌మి ప‌నుల‌ను ప్రారంభించారు. కానీ క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ఉత్స‌వాలు ఆల‌య ప్రాంగ‌ణంలోనే నిర్వ‌హించారు. ముత్యాల త‌లంబ్రాల అమ్మ‌కాలు కూడా లేక‌పోవ‌డంతో ఆదాయం రాలేదు. ఈ నేప‌థ్యంలో నేరుగా భ‌ద్రాచ‌లం రాలేని భ‌క్తుల సౌక‌ర్యం కోసం ఆన్‌లైన్ సేవ‌ల‌ను ప్రారంభించారు. భ‌క్తులు ఆన్‌లైన్‌లో ఆయా సేవ‌ల‌ను ఎంచుకుని, వారి గోత్ర నామాలు తెలిపినట్ల‌యితే, వారి పేరున పూజ‌లు జ‌రిపి, మెసేజ్ రూపంలో వారికి తెలియ‌ప‌ర్చుతామ‌ని దేవ‌స్థానం అధికారులు పేర్కొన్నారు.

Related Posts