YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మే 3 తర్వాతే స్థానిక ఎన్నికలు

మే 3 తర్వాతే స్థానిక ఎన్నికలు

మే 3 తర్వాతే స్థానిక ఎన్నికలు
విజయవాడ, ఏప్రిల్ 16
ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు స్థానికుల నిర్వహణ కలగానే మారిపోయింది. ఊహించని వరస పరిణామాలతో ఇక్కడ స్థానిక ఎన్నికలకు వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జగన్ ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించాలని ఎంతటి ప్రయత్నాలు చేసినా విధి మాత్రం బ్రేకులు వేస్తూనే ఉంది. మరి ఈ సర్కార్ ఎలక్షన్ డ్రీం తీరేదెప్పుడు? అన్నదానిపై రకరకాల కథనాలు, విశ్లేషణలు జరిగిపోతున్నాయి.నిజానికి ఇక్కడ జరగాల్సిన ఎన్నికలను గత ప్రభుత్వంలోనే చేపట్టాల్సి ఉంది. అయితే, ఫలితాలు అటు ఇటైతే ప్రభావం సాధారణ ఎన్నికలపై పడే అవకాశం ఉండడంతో ఆ ఎన్నికల తరవాతే స్థానిక ఎన్నికల జోలికి వెళ్లొచ్చులే అని చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు వాయిదా వేసుకుంది. సాధారణ ఎన్నికలలో వైసీపీ గెలుపుతో జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తరవాత ఆ ప్రభుత్వం ఆరునెలలు వాయిదాలు వేసుకుంటూ వచ్చింది.ముందుగా తన హామీలలో కొన్నిటిని నెరవేర్చి ఎన్నికలకు వెళ్లాలని భావించిన జగన్ ప్రభుత్వం రిజర్వేషన్లని, ఆర్డినెన్సులనీ జాప్యం చేస్తూ వచ్చి నగదు బదిలీ పథకాలను కొన్ని ప్రజలలోకి తీసుకెళ్లి ఎన్నికలకు వెళ్ళింది. అది కూడా ఫటా ఫట్ ఎన్నికలను నిర్వహించేలా ఆర్డినెన్సును తీసుకొచ్చి ఎన్నికలకు దిగింది. ప్రతిపక్షానికి ఊపిరి సలపకుండా ఎన్నికలను నిర్వహించాలన్నది ఇక్కడ వేసిన ప్లాన్.అయితే, ఎస్ఈసి రమేష్ కుమార్ ఊహించని విధంగా వాయిదా వేయడంతో ప్రభుత్వంలో అసహనం కట్టలు తెంచుకుంది. దాని పర్యవసానం కూడా అందరికీ తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సుప్రీమ్ కోర్టుకి వెళ్లగా ఎన్నికలకు నాలుగు వారాల ముందు ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అంతకు ముందే ఎస్ఈసీగా ఉన్న రమేష్ కుమార్ ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేస్తూ గడువు అనంతరం సమీక్షించి ఎన్నికలు నిర్వహించేలా పేర్కొన్నారు.సుప్రీమ్ కోర్టు కూడా అప్పుడు ఎస్ఈసీ నిర్ణయాన్నే సమర్ధించింది. అయితే, ప్రభుత్వం మాత్రం అప్పటి నుండి ఇప్పటికే ఎన్నికలను నిర్వహించేందుకే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఎస్ఈసీని తొలగించిన ప్రభుత్వం అతని స్థానంలో కొత్త ఎస్ఈసీ నియమించి ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ వేసినట్లుగా రాజకీయ వర్గాలలో బలంగా వినిపించింది. అందుకు తగ్గట్లే వచ్చి రాగానే కొత్త ఎస్ఈసీ సమీక్ష కూడా నిర్వహించారు.ఎన్నికల కోసమే సీఎం జగన్ ఏపీలో లాక్ డౌన్ అవసరం లేదని రెడ్ జోన్స్ లో మాత్రమే లాక్ డౌన్ అమలు చేస్తామని కేంద్రానికి లేఖరాశారు. ప్రధాని మోడీకి కూడా సీఎం అదే మాట చెప్పారు. అనంతరం ప్రతిఒక్కరికి మూడు మాస్కులను పంపిణీ చేసి ఎన్నికలకు వెళ్లాలని రెడ్ జోన్స్ ప్రాంతాలలో దాదాపుగా ఏకగ్రీవం అయ్యేలా చూడాలని.. మొత్తానికి ఎన్నికలను జరిపి తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూసినట్లుగా విశ్లేషించారు.అయితే ప్రధాని మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడగింపుతో ఏపీలో ఎలాంటి కదలికలు లేకుండా చేశారు. ఆ గడువులోపుగా రమేష్ కుమార్ విధించిన ఆరు వారాలు గడువు ముగుస్తుంది.. ప్రభుత్వం ఫటా ఫట్ ఎన్నికలకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ గడువు కూడా ముగిసిపోతుంది. దీని ప్రకారం ఇప్పటికే నామినేషన్లు పూర్తయి.. ఏకగ్రీవమైన స్థానిక సంస్థల ఎన్నిక కూడా చెల్లదని మళ్ళీ మొదటి నుండి ప్రక్రియ మొదలు కావాల్సి వస్తుందని న్యాయ వర్గాలు చెప్తున్నారు.ఎన్నికలు జరపాలంటే ప్రభుత్వం స్థానిక ఎన్నికలపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు చట్టబద్దత కల్పించాల్సి వస్తుందని.. అప్పుడే అడ్డంకులు లేకుండా ఎన్నికలు వీలవుతాయని మరికొందరు న్యాయనిపుణుల అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఒకవేళ మే 3 తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో... అప్పటికి.. ఇప్పడు నడుస్తున్న ఎస్ఈసీ తొలగింపు కేసులు, తెచ్చిన ఆర్డినెన్స్ చెల్లుబాటు.. దానికి చట్టబద్దత ఇదంతా కలిసి ప్రభుత్వ ఎన్నికల కల ఇప్పట్లో తీరే అవకాశాలు కనిపించడంలేదు.

Related Posts