సీపీఐ రాష్ట్ర మహాసభలు మచి ఉత్సాహ వాతావరణంలో జరిగాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో అయన మాట్లాడారు. ఎప్రిల్ 1-4 వరకు సీపీఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించాం. అంతర్జాతీయ జాతీయ అంశాలపై చర్చించాం. బహిరంగ సభ కూడా విజయవంతంగా నిర్వహించుకున్నామని అయన అన్నారు. సీపీఐ రాష్ట్ర మహాసభల సభలో 35-40 వయసున్న యువత 60% హాజరయ్యారు. యువత మా వైపు ఉన్నారన్నారు. లౌకిక ప్రజాతంత్ర వామపక్ష విశాల వేదిక ఏర్పాటుకు పిలుపునిచ్చింది. బీజేపీ హాఠావో దేశ్ బచావో కు పిలుపునిచ్చాం. టీడీపీ, కోదండరాం, మందకృష్ణ, సీపీఎంలతో చర్చిస్తున్నామని అయన అన్నారు. కేసీఆర్ ఏక పక్ష నిర్ణయాలు అహంకార పూరిత వైఖరిని ఎండగడుతాం. సుఫ్రీం కోర్టు దళితుల రక్షణ పై ఇచ్చిన తీర్పు పై కేసీఆర్ మాట్లాడుతాడు. కాని సిరిసిల్లా దళితులపై దాడులపై మాత్రం స్పందించడు. దాడులు ప్రోత్సహించేలా ప్రవర్తిస్తున్నాడు. సిరిసిల్లా ఎస్పీ పై ఇంతవరకు అట్రాసిటి కేసులు పెట్టలేదని అయన విమర్శించారు. పత్రికా స్వేచ్ఛ పై కేంద్రాన్ని విమర్శించే కేసీఆర్, రాష్ట్రంలో నియంతృత్వ వైఖరితో పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నాడు. తనకు వ్యతిరేక వార్తలు రాసే పేపర్లకు యాడ్స్ ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణ లో టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలన్నదే మా నిర్ణయం . సీఆర్ ను గద్దె దించెందుకు ఒక ప్రత్యామ్నాయం అవసరమని అయన అన్నారు. రాష్ట్ర విభజన చట్టం అమలులో కేంద్రం విఫలమైంది. వాటిని సాధించడంలో కేసీఆర్ సర్కార్ తీవ్రం గా విఫలమైంది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజున అమరవీరుల ఆశయాల సాధన దినంగా నిర్వహిస్తామని అయన అన్నారు. సామాజిక తెలంగాణ సమగ్రాభివృద్దికి సీపీఐ పనిచేస్తుంది. అందుకు మా పార్టీ 31 జిల్లాల అంతర్గత పదవుల్లో అన్ని వర్గాలకు అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాం. ఇప్పడే ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాం. తెలంగాణ వచ్చాక వామపక్ష ఐక్యత పెరిగింది. కేవలం వామపక్షాలతో బలం సరిపోదని ఇతరులను కలుపుకొని పోవాలనుకుంటున్నామని అయన అన్నారు.