YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

నాటుసారా కల్తీకల్లు అమ్మి నట్లయితే తాట తీస్తాం..

నాటుసారా కల్తీకల్లు అమ్మి నట్లయితే తాట తీస్తాం..

 నాటుసారా కల్తీకల్లు అమ్మి నట్లయితే తాట తీస్తాం..
ఎక్సేజ్ సిఐ నాగసునీత రాణి
నందికొట్కూర్ ఏప్రిల్ 16
నందికొట్కూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండలాలు గ్రామాలు లొ నాటుసారా కల్తీకల్లు అమ్మి నట్లయితే తాటతీస్తా మని నందికొట్కూర్ ఎక్స్చేంజ్ సీఐ నాగ సునిత హెచ్చరించారు. బుధవారం నాడు నందికొట్కూరు పట్టణంలోని షికారి విస్తృతస్థాయి దాడులు నిర్వహించి బెల్లం ఊట. నాటుసారా ధ్వంసం చేశామని ఆమె అన్నారు. ఈ కరొణా మహమ్మారితో ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కార్యక్రమం ఏర్పాటు చేసినందున. ప్రభుత్వం వైన్ షాప్ లను బంద్ చేయడం జరిగినది. అందుకు ప్రజలు కల్తీ కల్లు నాటుసారా పై మొగ్గు చూపడంతో ప్రజలు కల్తీకల్లు నాటు సారా తాగి ఆరోగ్య లోపాలు చేసుకోవడమే తప్ప బాగుపడేది లేదన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. కర్నూలు ఎక్సైజ్   డిప్యూటీ కమిషనర్  చెన్నకేశవ రావు  ఆదేశాల మేరకు , అసిస్టెంట్ ఎక్సైజ్   సూపరింటెండెంట్ .జానకిరామ్  పర్యవేక్షణలో ఈరోజు నందికొట్కూరు  ఎక్సైజ్  స్టేషన్ పరిధిలోని   నీలిషికార్ కాలనీ లో నాటుసారా తయారీ కేంద్రాల పై   విస్తృత దాడులు చేయడం జరిగింది . ఇందులో సుమారు 2000 లీటర్ల బెల్లపు ఊటను 25 లీటర్ల నాటు సారా ను ధ్వంసం చేయడం జరిగింది .  ఈ దాడుల్లో   నందికొట్కూరు అబ్కారీ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్  నాగ సునీత తమ స్టేషన్   సిబ్బందితో,కర్నూలు ఇన్స్పెక్టర్ . సుహాసిని తమ టీం సిబ్బంది తో,పాల్గొనడం జరిగింది .

Related Posts