కృష్ణ జింకలను వేటాడిక కేసులో నటుడు సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ జోధ్ పూర్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. దీనితో పాటు రూ.పదివేలు జరిమానా విధించింది. రెండేళ్లలోపు జైలు శిక్ష పడి ఉన్నట్లయితే సల్మాన్ ఖాన్ కు బెయిలు కోసం దాఖలు చేసుకునే అవకాశం ఉండేది. ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ దేవ్ కుమార్ కత్రి తీర్పు ఇచ్చారు. ఈ కేసులో సల్మాన్ ను దోషిగా తేల్చిన కోర్టు, మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, టబూ, నీలమ్, స్థానికుడు దుష్యంత్ సింగ్ లను న్యాయమూర్తి నిర్దోషులని న్యాయమూర్తి ప్రకటించారు. ఈ కేసులో 28 మందిని సాక్షులుగా ప్రవేశపెట్టారు. తీర్పును రాజస్థాన్ హైకోర్టులోసాల్మన్ సవాల్ చేసే అవకాశం ఉంది కానీ వెంటనే బెయిలు లభించే అవకాశం లేదు. రాజస్థాన్ హైకోర్టు శిక్ష అమలుపై స్టే ఇస్తేనే ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. తీర్పు వెలువడగానే సల్మాన్ ను జోధ్ పూర్ జైలుకు తరలించారు. 1998 అక్టోబర్ లోరాజస్థాన్ లోని కంకణి దగ్గర కృష్ణ జింకలను వేటాడినట్టు సల్మాన్ తదితరులపై కేసు నమోదయింది. సల్మాన్ పై వన్యప్రాణి చట్టం సెక్షన్ 51 కింద, ఆ పమయంలో్ అతడితో వున్న మిగతావారిపై సెక్షన్ 149 కింద కేసు అభియోగాలు నమోదు చేసారు. ఈ ఏడాది మార్చి 28న కేసు విచారణ ముగిసింది. ఈ తారలంతా హమ్ సాధ్ సాధ్ హై చిత్రం నిర్మాణంలో వున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో కంకణి గ్రామంలో సంచరిస్తున్న రెండు కృష్ణ జింకలపై సల్మాన్ కాల్పులు జరిపారు. ఆ కాల్పుల శబ్దం విన్న గ్రామస్థులు ఉలిక్కిపడి అక్కడికి రాగా కృష్ణ జింకల చనిపోయి ఉండటం గమనించారు. గ్రామస్థుల్లో కొందరు సల్మాన్ వెంబడించగా ఆయన పరారయ్యారు. బిష్నోయ్ వర్గానికి చెందిన గ్రామస్థులు కృష్ణజింకను దైవంగా భావిస్తారు. అలాంటిది తమ కుల దైవాన్నే చంపాలనుకున్నాడన్న కోపంతో సల్మాన్‌పై మిగతా నటీనటులపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలా ఈ కేసు ఇరవై ఏళ్ల పాటు కొనసాగి, ఎన్నో విచారణల అనంతరం సల్మాన్‌ను దోషి తేలుస్తూ న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.