YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

రేవంత్ రెడ్డి ఒక జోకర్..బ్రోకర్..ఐటమ్ సాంగ్ డ్యాన్సర్

రేవంత్ రెడ్డి ఒక జోకర్..బ్రోకర్..ఐటమ్ సాంగ్ డ్యాన్సర్

రేవంత్ రెడ్డి ఒక జోకర్..బ్రోకర్..ఐటమ్ సాంగ్ డ్యాన్సర్ పాలకుర్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎర్రబెల్లి

కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. 'రేవంత్ రెడ్డి ఒక జోకర్..బ్రోకర్..ఐటమ్ సాంగ్ డ్యాన్సర్' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు వరంగల్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు రేవంత్ రెడ్డిని తానే జైల్లో పెట్టించానని ఆయన చెప్పారని, మరి, జైలు నుంచి తిరిగి వచ్చాక రేవంత్ రెడ్డి తన ఇంటికి ఎందుకొచ్చారని ప్రశ్నించారు. అసలు నాడు టీడీపీలో ఉన్నప్పుడే ఈ విషయం ఎందుకు బయటపెట్టలేదంటూ రేవంత్ పై ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, పూర్తయిన ప్రాజెక్టులు కాంగ్రెస్ నేతలకు కనపడటం లేదా? అని ప్రశ్నించారు.నాయకుడిని... పార్టీని విమర్శించే హక్కు ఉంటే ప్రజలకు జవాబు చెప్పే బాధ్యత కూడా ఉండాలని ఎమ్మెల్యే ఎర్రబెల్లి అన్నారు. కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్ పార్టీపైనానేతలపైనా విమర్శలు చేశారు. మద్దతు ధర ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. కాని కనీస ఇంగితజ్ఞానం లేకుండా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు జలయత్నం అంటూ ధనయగ్నం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని ప్రాజెక్టులను తెచ్చామో కనిపించడం లేదా. తండాలని గ్రామపంచాయతీలుగా మీరు ఎందుకు గుర్తించలేదు. దళితుల గురించి మాట్లాడే నైతక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. పాలకూర్తి వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ హయాంలో మోకాలు లోతు బొందలుంటే ఇప్పుడు ఎటువంటి రోడ్లు ఉన్నాయో కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తమ పాలనలో పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. . నేను నీలాగా పూటకో పార్టీ మారలేదు. పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశాను. నన్ను విమర్శించే నైతిక రేవంత్ కు హక్కు లేదన్నారు.

Related Posts