YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం విదేశీయం

భారీగా తగ్గిన క్రూడాయిల్ ధరలు

భారీగా తగ్గిన క్రూడాయిల్ ధరలు

భారీగా తగ్గిన క్రూడాయిల్ ధరలు
ముంబై, ఏప్రిల్ 16 
దేశీ ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతూ వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈ రోజు కూడా ఎలాంటి మార్పు లేదు. నిలకడగానే ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లో గురువారం లీటరు పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దిగొచ్చాయి.అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.74.61 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర కూడా రూ.68.52 వద్దనే నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర స్థిరంగా రూ.74.21 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.68.15 వద్దనే నిలకడగా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర రూ.69.59 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.62.29 వద్ద నిలకడగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర రూ.75.30 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.65.21 వద్ద నిలకడగా కొనసాగుతోంది.అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు బుధవారం తగ్గాయి. 18 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 6.45 శాతం తగ్గుదలతో 27.69 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.19 శాతం క్షీణతతో 19.87 డాలర్లకు తగ్గింది. 2002 నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయిఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు

Related Posts