YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మరో ముందడుగు

మరో ముందడుగు

వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. నగరాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చేందుకు కొత్త మాస్టర్ ప్లాన్ కు ఆమోదం తెలిపింది. జూన్ నెలాఖరు నుంచే ఈ ప్లాన్ అమల్లోకి రానుండడంతో స్థానికుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రాంతం అన్నిరంగాల్లోనూ మరింతగా ముందడుగేసేందుకు అవకాశం ఉంటుందని అంతా అంటున్నారు. ఇదిలాఉంటే కొత్త స్థానికంగా ఔటర్ రింగ్ రోడ్ పాటూ అంతర్గత రింగ్ రోడ్ ఆవశ్యకత ఉంది. ఈ చారిత్రాత్మక ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో ఈ ప్రాంతానికి ఎయిర్ పోర్ట్ కూడా ఉండాలని అంతా అభిలషిస్తున్నారు. వారి అభిమతానికి తగ్గట్లే విమానాశ్రయ పునరుద్ధరణ పనులను ప్రారంభించినట్లు మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రకటించారు. విజన్‌-2040 పేరుతో లీ అసోసియేట్స్‌ సంస్థ ఆధ్వర్యంలో వరంగల్ కు మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేశారు. స్మార్ట్‌సిటీ, అమృత్‌, హృదయ్‌, కాకతీయ మెగా వస్త్రనగరి, హైదరాబాద్‌-వరంగల్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌, ఔటరు, ఇన్నర్‌ రింగురోడ్లు తదితర అంశాలను సమీకృతం చేసి ప్లాన్‌ను తయారుచేశారు.

ఏప్రిల్ 15న  ఈ మాస్టర్‌ప్లాన్‌ ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ముసాయిదా విడుదల అనంతరం అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రాధాన్యతనిస్తారు. దీనికోసం 45 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ అభ్యంతరాలపై 15 రోజుల పాటు సమాధానాలు ఇస్తారు. ఈ షెడ్యూల్ దాదాపు జూన్‌ రెండో వారం వరకూ కొనసాగుతుంది. అదే నెల 15 నుంచి నూతన మాస్టర్‌ప్లాన్‌ అమల్లోకి రానుంది. ఈనెల 10న మరోమారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌, ప్రజాప్రతినిధులంతా సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. వరంగల్ అభివృద్ధిలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు. ఈ క్రమంలో ఆక్రమణలు తొలగింపుపై దృష్టి సారించారు. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. ప్రజా రవాణాపైనా దృష్టి సారించారు. నానాల ఆక్రమణల తొలగింపుకు 6 టీమ్ లను ఏర్పాటుచేశారు. మొత్తంగా వరంగల్ ను మహానగరంగా తీర్చిదిద్ది.. మంచి పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టడంతో సర్వత్రా హర్షం వెల్లువెత్తుతోంది.

Related Posts