YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

పేద యువతులే టార్గెట్

పేద యువతులే టార్గెట్

గుంటూరు జిల్లా లో సెక్స్ మాఫియా అమాయక అమ్మాయిల పై పంజా విసురుతోంది. పేదరికంతో ఉన్న మహిళ ల కు మాయ మాటలు చెప్పి దుబాయ్ కి తరలిస్తున్నారు. అక్కడ వేధింపులు తాళ లేక బాధితులు పోలీస్ ల ను ఆశ్రయిస్తున్నారు. రంగం లో కి దిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాధితులకు అండగా నిలబడింది, బాధితులను నరక కుపాలనుం డి విడిపించి రాష్ట్రానికి తీసుకువచ్చారు..మొత్తం ఈ మాఫియా లో ఎవరు ఉన్నారు...ఎంత మంది నీ తరలించారు ఇంకా ఎంతమంది దుబాయ్ లో మగ్గుతున్నారు అన్న విచారణ ప్రారంభించింది. గతం లో కిడ్నీ మాఫియా ఆ తర్వాత క్లినికల్ డ్రగ్ మాఫియా ఇప్పుడు సెక్స్ మాఫియా అమాయక ప్రజల మహిళల ను టార్గెట్ చేస్తున్నాయి. ఇన్నాళ్ళు తెలుగు రాష్ట్రాలకి పరిమితమైన ఈ మాఫియా లు ఇప్పుడు ఏకంగా దేశం దాటి అమాయక మహిళలను దుబాయ్ చేరుస్తున్నారు. ఇందులో భాగంగా పిడుగురాళ్ల కు చెందిన ఓ మహిళను రంగం లో కు దింపారు. దుబాయ్ కి అమ్మాయిలను తరలిస్తే దండి గా డబ్బులు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో ఆ మహిళ స్థానికం గా సున్నపు బట్టి ల లో ఇతర ఫ్యాక్టరీ లలో పని చేస్తున్న మహిళ ల ను టార్గెట్ చేసింది. ఇక్కడ పని చేస్తే ఏం వస్తుంది. అదే దుబాయ్ లో అయితే విలాసవంతంగా బ్రత కొచ్చొని నమ్మబలికింది. ఆ మాయ లేడీ ఉచ్చు లో పడ్డ అనేక మంది మహిళ లు గత ఏడాది జూన్ లో దుబాయ్ విమానం ఎక్కారు. దుబాయ్ లో మహిళలను ముందు పని ఇప్పిస్తామని ఓ హోటల్ లో ఉంచి ఆ తర్వాత బలవంతంగా సెక్స్ కుపాల కు తరలించారని బాధితుల కథనం. అక్కడి బాధలు భరించలేక సెక్స్ వర్కర్లు గా జీవించలేక నరకం చూశామని అంటున్నారు. ఇదే విషయాన్ని దుబాయ్ పోలీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు బాధితులు. దీంతో మాఫియా వ్యవహారమంతా బయటపడింది.

Related Posts