YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉపాధికి మరింత ఊతంగా..

ఉపాధికి మరింత ఊతంగా..

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు రూ.8 కూలీని పెంచుతూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రూ.197కు బదులు ఇక నుంచి రూ.205 వేతనంగా లభిస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ కూలీలకు లబ్ధి చేకూరుతుంది.  నాగర్ కర్నూల్ విషయానికి వస్తే 3,78,897 మంది లాభపడతారు. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 6,90,742 జాబ్‌ కార్డులను డ్వామా అధికారులు జారీ చేశారు. వాటి పరిధిలో 15,13,533 మంది కూలీలు ఉన్నారు. పెరిగిన కూలీ రేట్ల వల్ల వీరికి ప్రయోజనం చేకూరుతుంది. ఒక ప్రాంతంలో పని చేస్తున్న కూలీలు చేసిన పనికి వారికి ఆ రోజు రూ.150 కూలీ పడితే వీటితోపాటు వేసవి కరవు భత్యం కింద మరో రూ.45లు జత కానున్నాయి. దీంతో ఆ కూలీకి ఆ రోజు మొత్తం రూ.195లు కూలీ పడినట్లు. ప్రతి ఏడాది వేసవిలో కరవు భత్యం ఫిబ్రవరిలో 20శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌, మేల్లో 30 శాతం, జూన్‌లో 20శాతం చొప్పున కూలీలకు చెల్లించనున్నారు. పెంచిన వేతనాలు ఈ నెల నుంచే అమలు చేస్తారు. దీంతో ఉమ్మడి జిల్లాలో కూలీలకు ఆర్ధికంగా కొంత ఆదరువు పెరిగినట్లవుతుంది.

Related Posts