మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన
కలెక్టర్
కామారెడ్డి ఏప్రిల్ 16
మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉందని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగే విధంగా వైద్య సిబ్బంది చూడాలని జిల్లా కలెక్టర్ శరత్ కోరారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్లోని హాల్లో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు చేసుకున్నవారికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల గురించి వైద్య సిబ్బంది వివరించాలని సూచించారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు 100 శాతం వేయాలని కోరారు. విధులు సక్రమంగా నిర్వహించని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గర్భవతుల నమెదు తప్పనిసరిగా చేపట్టాలని, పేదవారికి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. వైద్య సిబ్బంది వైద్యాధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పగడ్బందీగా నిర్వహించాలని కోరారు. కరోనా వైరస్ నియంత్రణకు వైద్య సిబ్బంది చేసిన కృషిని అభినందించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్జి వెంకటేష్ దోతురే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం అధికారిని విశాల రాణి, వైద్యులు పర్యవేక్షకులు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.