బిజేపి నాయకుడు సోము వీర్రాజు జాతీయ పార్టీ నాయకునిలా కాకుండా రాయలసీమ లో ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా మాట్లాడుతున్నాడని మంత్రి అమరనాధరెడ్డి విమర్శించారు. గురువారం నాడు అయన చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి , బిజేపి ప్రభుత్వానికి ఆకర్షితులై వస్తున్నాయన్న వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. కియా మోటార్స్ ప్రాజెక్టు తమ రాష్ట్రాలలో నెలకొల్పాలని గుజరాత్ సహా పలు రాష్ట్రాలు పోటీ పడినా చంద్రబాబు సామర్ద్యం తో ఆ కంపనీ వారు ఆంధ్ర ప్రదేశ్ లో పరిశ్రమ నెలకొల్పారని అయన అన్నారు. మోడి తిరుపతిలో ప్రజలకిచ్చిన విభజన హామీలు ప్రజల మదిలో నిలిచిపోయాయి . అవి నెరవేర్చకపోతే గతంలో కాంగ్రెస్ కు పట్టిన గతే బిజేపి పార్టీకి కూడా పడుతుంని అయన హెచ్చరించారు. చంద్రబాబు రెండు రోజుల పాటు జాతీయ స్దాయిలో అఖిల పక్ష నాయకులను , మీడియా ను కలవడం ద్వారా మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారని మంత్రి అన్నారు. మరో వైపు రాష్ట్రం లో అఖిల పక్షం కు పిలుపునిస్తే ప్రతిపక్షం తప్పించుకు తిరుగుతుంది . రాజీనామాల పేరుతో వైసిపి డ్రామలాడుతొంది . ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపిస్తే సమస్యలపై పోరాడ కుండా డ్రామాలాడడం తగదని అయన అన్నారు.