YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రెండు ప్రత్యేక రైళ్లు

రెండు ప్రత్యేక రైళ్లు

రెండు ప్రత్యేక రైళ్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16
దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ పాటిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జా రవాణాను స్తంభించి పోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో బస్సులు, రైళ్లు, విమాన ప్ర‌యాణాల‌తోపాటు వ్యక్తిగత వాహనాలను రోడ్ల మీద తిరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్ర‌త్యేకావ‌స‌రాల దృష్ట్యా రెండు స్పెషల్ రైళ్ల‌ను నడపాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్ప‌టికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీనికి ఆమోదం తెలిపింది. ఉత్త‌ర‌, ఈశాన్య ప్రాంతాల‌కు సైనికుల‌ను చేర్చేందుకుగాను ఈ రెండు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపనున్నారు. ఈనెల 17, 18 తేదీల్లోఈ ట్రైన్లు ప్రయాణం ప్రారంభించనున్నాయి.17న బ‌య‌లుదేరే ట్రైన్ బెంగ‌ళూరు-బెల్గాం-సికింద్రాబాద్‌-అంబాల‌-జ‌మ్ము మీదుగా ప్ర‌యాణించి ఈనెల 20న గ‌మ్య‌స్థానానికి చేరుతుంది. అలాగే 18న బ‌య‌లు దేరే ట్రైన్ బెంగ‌ళూరు-బెల్గాం-సికింద్రాబాద్‌-గోపాల్‌పూర్‌-హౌరా-న్యూజ‌ల్పాయ్‌గురి-గువాహ‌టి మీదుగా ఈనెల 20న గ‌మ్య‌స్థానానికి చేరుతుంద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి.ఇప్ప‌టికే ఆయా ప్రాంతాల్లో శిక్ష‌ణ పూర్తి చేసుకున్న సైనికుల‌ను సరిహ‌ద్దుల్లోకి ఈ రైళ్ల ద్వారా చేరుస్తామ‌ని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీరంద‌రి క్వారంటైన్ పీరియ‌డ్ ముగిసి, మెడిక‌ల్లీ ఫిట్ అని తేలిన త‌ర్వాతే విధుల్లోకి తీసుకుంటామని తెలిపాయి. మ‌రోవైపు రాబోయే రోజుల్లో మ‌రిన్ని రైళ్ల కోసం రైల్వే మంత్రిత్వ శాఖతో చ‌ర్చిస్తామ‌ని పేర్కొన్నాయి.
 

Related Posts