YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

వెనుక డోర్ నుంచి దోచేస్తున్నారు

వెనుక డోర్ నుంచి దోచేస్తున్నారు

 

వెనుక డోర్ నుంచి దోచేస్తున్నారు
వరంగల్, ఏప్రిల్ 17
వేసిన తాళం, సీల్‌ వేసినట్లే ఉంటున్నాయి.. కానీ దుకాణంలో మద్యం మాత్రం మాయమవుతోంది. దొడ్డిదారిన బెల్టు షా పులు, మందు బాబులకు మద్యం చేరుతోంది. లాక్‌డౌన్‌ ఉన్నా ఈ దందా జిల్లాలో గుట్టుచప్పుడు కా కుండా సాగుతోంది.‘లాక్‌’ మీకు.. దొడిదారి మాకు’ అన్నట్లుగా కొందరు మద్యం వ్యాపారులు వ్యవహరి స్తున్నారు. ఒక్కో బాటిల్‌పై ఎమ్మార్పీ కన్నా మూడు రెట్ల వరకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. వాహన తని ఖీల్లో మద్యం పట్టుబడుతుండడంతో ‘లాక్‌’ నిబంధనలను పట్టించుకోవడం లేదని స్పష్టమవుతోంది.జిల్లాలో 75 మద్యం దుకాణాలు, 16బార్లు ఉన్నా యి. గత నెల 22న జనతా కర్ఫ్యూ నుంచి వీటికి మూత పడింది.ఎక్త్సెజ్‌ అధికారులు దగ్గరుండి వీటికి సీల్‌ వేశారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు తెరవద్దని ఆయా యజమానులను ఆదేశించారు. అయితే గత నెల 31వరకు రాష్ట్ర ప్రభుత్వం తొలుత లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14 వరకు, అనంతరం వచ్చే నెల 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. వరుసగా ఇన్ని రోజు లు లాక్‌డౌన్‌ ఉంటుందని మద్యం వ్యాపారులు ఊహించలేదు. లాక్‌డౌన్‌లోనూ సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు దొడ్డిదారి దందాకు తెరతీసినట్లు సమాచారం. సీల్‌ వేసిన ఉన్నా దుకాణా నికి వెనక నుంచి ఉన్న డోర్‌తో రాత్రికి రాత్రే మద్యం తీసి దూర ప్రాంతాల్లో తమకు తెలిసిన బెల్టు షాపులు, బంధువుల ఇళ్లకు తరలించారు. ముందు సీల్‌ ఉన్నా వెనక నుంచి మద్యం తరలించినా సంబంధిత శాఖ అధికారులు మాత్రం పసిగట్ట లేదఇలా దుకాణం నుంచి బయటికి తీసిన మద్యాన్ని వ్యాపారులు ఎమ్మార్పీ కన్నా మూడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. పట్టణాల్లో ఈ దందా జోరుగా జరుగుతోంది. లాక్‌డౌన్‌ ఎత్తితేనే దుకాణాలు తెరవనుండడంతో మద్యం ప్రియులు కూడా ఎంత ధర పెట్టయినా మద్యం కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు, పట్టణాల్లో పలువురు వ్యక్తులు మద్యం అమ్ముతుండడం తనిఖీల్లో బయట పడింది. గత నెల 22నుంచి ఇప్పటి వరకు జిల్లాలో మద్యం తరలిస్తూ పట్టుబడిన కేసులు 34 నమోదయ్యాయి. 740 క్వార్టర్‌ బాటిల్స్, 40 హాఫ్‌ బాటిల్స్, 258 బీర్‌ బాటిల్స్‌ సీజ్‌ చేశారు. వాహన తనిఖీల్లో మద్యం పట్టుబడుతుండడంతో పోలీసుల కళ్లు గప్పి భారీ స్థాయిలోనే మద్యం దందా కొనసాగుతుందని సమాచారం.వాహన తనిఖీల్లో మద్యం పట్టుబడుతుండడంతో దుకాణాలపై పోలీసు, ఎక్సైజ్‌ శాఖ అధికారులు నిఘా పెట్టారు. లాక్‌డౌన్‌ ప్రారంభంలో దుకాణ యజమాని వేసిన తాళానికి ఎక్త్సెజ్‌ శాఖ సీల్‌ వేసింది. మద్యం దందాకు చెక్‌ పెట్టేందుకు రెండు రోజుల క్రితం దుకాణ యజమాని వేసిన తాళంతో పాటు ఎక్సైజ్‌ శాఖ కూడా మరో తాళం వేసి.. సీల్‌ వేసింది. డబుల్‌ లాక్‌తో దందాకు అడ్డుకట్ట వేసినట్లేనని ఆయా అధికారులు భావిస్తున్నా.. జిల్లాలో మారుమూలన ఉన్న మండలాల్లోని దుకాణాల నుంచి ఇప్పటికే చాలా వరకు మద్యం తరలించినట్లు ఆరోపణలున్నాయి. సంబంధిత అధికారులు ఇటీవల రెండు, మూడు దుకాణాలు తనిఖీ చేయడంతో స్టాక్‌లో స్వల్పంగా మార్పులు కనిపించినట్లు తెలిసింది. లాక్‌డౌన్‌ ఎత్తిన తర్వాత దుకాణాల్లో ఉన్న స్టాక్‌ చెక్‌ చేసి, ఎక్కడైనా తక్కువ ఉంటే ఆ దుకాణాల యజమానులపై కేసులు పెట్టాలని జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారులను ఉత్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
 

Related Posts