ఎన్డీఏ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలపై దేశవ్యాప్తంగా దాడులు పెరిగాయి. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం కోరలు తీసే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. గురువారం నాడు అయన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 111వ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తరువాత అయన మాట్లాడుతూ చట్టాలను అమలు చేయాల్సిన కోర్టులే..వాటిని నీరుగార్చే ప్రయత్నం చేయడం బాధాకరమ ని అన్నారు. స్వాత్రంత్యం వచ్చి 68 ఏళ్లు అవుతున్నా..ఎస్సీ, ఎస్టీలను అణగదొక్కే కుట్ర జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీల పీవోఏ చట్టం నీరుగార్చడాన్ని సిఎం కేసిఆర్ ఖండించారు. ఎస్సీ, ఎస్టీలపై కేంద్రానికి ప్రేమ ఉంటే సుప్రీం కోర్టులో కేసును వెనక్కి తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలని విజ్ణప్తి చేసారు. ఎస్సీ, ఎస్టీలు హక్కుల కోసం పోరాడుతుంటే....కేంద్రం వాటిని నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని సిఎం కేసిఆర్ అధికారికంగా జరపడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సభ్యులు, ఇతర నేతలు కుడా పాల్గోన్నారు.