YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

 24 గంటల్లో 11వేల మరణాలు

 24 గంటల్లో 11వేల మరణాలు

 24 గంటల్లో 11వేల మరణాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17  
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటి వరకూ 1.45 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 22 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. కోవిడ్-19కు అడ్డుకట్టవేయడానికి పలు దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిషేధాజ్ఞలు విధించి... ప్రజలను ఇళ్ల నుంచి రాకుండా ఆంక్షలు జారీచేస్తున్నాయి. అయినా, వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఈ మహమ్మారికి కారణంగా ప్రపంచంలో గంటకు సగటున 107 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికాలో మహమ్మారి విలయ తాండవం కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో మరో 2,569 మంది వైరస్‌‌కు బలయ్యారు. దీంతో అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 33 వేలు దాటింది. వైరస్‌ బాధితుల సంఖ్య 6.77 లక్షలకు చేరింది.ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా వైరస్ బాధితుల్లో 5.47 లక్షల మందికిపైగా కోలుకున్నారు. మరో 56,588 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 11,000 మంది మృతిచెందడం భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది. మరో 14.32 లక్షల మంది పరిస్థితి నిలకడగా ఉంది. అటు ఐరోపాలోని ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్‌లు కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా మరణాల్లో అమెరికా తర్వాత ఇటలీ (22,170), స్పెయిన్ (19,315), ఫ్రాన్స్ (17,920), బ్రిటన్ (13,720) స్థానంలో ఉన్నాయి. ఈ ఐదు దేశాల్లోనే మొత్తం 1.10 లక్షల మంది కరోనాకు బలయ్యారు. స్పెయిన్‌లో గురువారం 551 మంది, ఇటలీలో 350 మరణాలు నమోదయ్యాయి.అమెరికాలో 677,570, స్పెయిన్ 184,948, ఇటలీ 168,942, ఫ్రాన్స్ 165,027, జర్మనీ 137,698, యూకే 103,093, చైనా 82,367, ఇరాన్ 77,995, టర్కీ 74,193, బెల్జియం 34,809, బ్రెజిల్ 30,683, కెనాడ 29,214, నెదర్లాండ్ 29,214, రష్యా 27,938, స్విట్జర్లాండ్ 26,732, పోర్చుగల్ 18,841 కేసులు ఇప్పటి వరకూ నిర్ధారణ అయ్యాయి. ఇరాన్‌లో వైరస్ మరణాలు వరుసగా రెండో రోజూ 100లోపు నమోదయ్యాయి. గురవారం 99 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం 4,869 మంది చనిపోయారు. బెల్జియం 4,857, నెదర్లాండ్ 3,315, బ్రెజిల్ 1947, టర్కీ 1,643, కెనడా 1,195, స్విట్జర్లాండ్ 1,281, స్వీడన్ 1,333 మరణాలు చోటుచేసుకున్నాయి.అటు, పాకిస్థాన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతోంది. దాయాది దేశంలో వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య 6,919కి పెరిగింది. ఇప్పటివరకు 128 మరణాలు నమోదయ్యాయి. కరోనాను నిలువరించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుప్రీంకోర్టుకు తెలియజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను తన సలహాదారు(ఆరోగ్య వ్యవహారాలు) డాక్టర్‌ జాఫర్‌ మీర్జాపై పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మండిపడ్డారు.కరోనా సంక్షోభం నుంచి ఐరోపా ఇంకా బయటపడలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వ్యాఖ్యానించింది. స్పెయిన్‌, ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్‌ వంటి దేశాల్లో కేసులు తగ్గుముఖం పట్టినా నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. * కరోనా విజృంభణ తొలినాళ్లలో మిలన్‌లోని ఓ సంరక్షణ కేంద్రంలో దాదాపు 200 మంది అనుమానాస్పద స్థితిలో మృత్యువాతపడిన వ్యవహారంపై ఇటలీలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే టోక్యోలో విధించిన ఆత్యయిక స్థితిని ఇతర పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేస్తున్నట్లు జపాన్‌ ప్రధాని షింజో అబె గురువారం ప్రకటించారు.
 

Related Posts