YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మహా కరోనా ముప్పు

మహా కరోనా ముప్పు

మహా కరోనా ముప్పు
ముంబై, ఏప్రిల్ 17  
మహారాష్ట్ర కరోనా మహమ్మారితో విలవిలలాడిపోతోంది. దేశంలో నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదయింది మహారాష్ట్రలోనే. ఇక్కడ కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతోందే తప్ప తగ్గడం కన్పించడం లేదు. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 2916 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయి. మరణాల సంఖ్య కూడా ఇక్కడే ఎక్కువగా ఉంది. దీంతో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఎంత అప్రమత్తయినప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి.ఉత్తర్ ప్రదేశ్ తర్వాత అతి పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ పరిశ్రమలు కూడా ఎక్కువ. వాణిజ్య రాజధాని ముంబయిలో హై అలెర్ట్ ప్రకటించారు. ముంబయిలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ ప్రారంభమయిన నాటి నుంచే మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. లాక్ డౌన్ ను పటిష్టంా అమలు చేసినా ప్రయోజనం కన్పించడం లేదు. సాక్షాత్తూ మహారాష్ట్రలో మంత్రికే కరోనా సోకడం విశేషం.ఇక ఊహించిన విధంగానే కరోనా వైరస్ ముంబయిలోని ధారావి మురికివాడకు చేరుకుంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడకు కరోనా సోకితే ప్రమాదమని ముందు నుంచి ప్రభుత్వం అంచనాలు వేసింది. అయినా ఆపలేకపోయింది. దాదాపు పదిహేను లక్షల మంది ఈ మురికివాడలో నివాసముంటారు. ఇప్పటికే 60 మందికి పైగా ఇక్కడ కరోనా సోకింది. ఏడుగురు కరోనాతో మృతి చెందారు. ఇక్కడ ప్రత్యేకంగా క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ మురికివాడను రెడ్ జోన్ గా ప్రకటించారు.మహారాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అహ్మద్ కు కూడా కరోనా సోకింది. ఈయన స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయారు. ఒక పోలీసు అధికారితో ఇటీవల మంత్రి సమావేశమయ్యారు. పోలీస్ అధికారికి కరోనా పాజిటివ్ అని తేలడంతో మంత్రి ముందుజాగ్రత్తగా హౌస్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. మహారాష్ట్రలో ఎక్కువగా ముంబయి, పూనే, మీరాబయంద్, నవీ ముంబయి, థానే, రైగా, భివాండి ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయ. దీంతో ప్రభుత్వం ఇక్కడ హై అలెర్ట్ ప్రకటించింది. మొత్తం మీద కరోనా రూపంలో మహారాష్ట్రకు ముప్పు పొంచి ఉందన్నది నిపుణుల అంచనా. ముంబయి నగరం మరో న్యూయార్క్ నగరంగా మారక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Posts