ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
విశాఖపట్నం ఏప్రిల్ 17
జిల్లాలోని గోపాలపట్నం కొత్తపాలెం కార్వాల్ననగర్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. డాబాగర్డెన్స్ ఉమెన్స్ కాలేజీలో ర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మైనర్ విద్యార్థిని ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సెల్ఫోన్లో మెసేజ్ ఆధారంగా ప్రేమ వ్యవహారమే సూసైడ్ కారణమనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.