YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

కరోనాలో..మూడుపూవులు..ఆరుకాయలు గా వర్దీల్లుతున్న మద్యం వ్యాపారం

కరోనాలో..మూడుపూవులు..ఆరుకాయలు గా వర్దీల్లుతున్న మద్యం వ్యాపారం

కరోనాలో..మూడుపూవులు..ఆరుకాయలు గా వర్దీల్లుతున్న మద్యం వ్యాపారం
హైదరాబాద్ ఏప్రిల్ 17
బయటకు రావద్దురా చచ్చిపోతారు అని ప్రభుత్వాలు చెబుతుంటే ఇక్కడి మద్యం వ్యాపారులు మాత్రం బయటకు వచ్చి తమ వ్యాపారాలను చక్కగా చేసుకుంటున్నారు. ఇంత ప్రత్యేకత ఉన్న ఊరు ఏదా అని ఆలోచిస్తున్నారా? నిజామాబాద్. కరోనా వైరస్ భయంతో అధికారులు, పోలీసులు  ప్రజలను చైతన్యం చేస్తూ నిధులు నిర్వహిస్తుంటే మద్యం వ్యాపారులు మాత్రం అక్రమ మార్గంలో మద్యం అమ్ముకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు.ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిజామాబాద్ నగరంలోని బార్లలో లక్షల రూపాయల మద్యం దొడ్డి దారిలో అమ్మాకాలు జరుపుతున్నారు. దీనిని అదుపు చేయడంలో ఎక్సయిజ్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఎం ఎస్ ఆర్ బార్ మూడు బ్రాంచీలు నగరంలో ఉన్నాయి.వీటి నుంచి అక్రమంగా తరలించి రెట్టింపు ధరలకు మద్యం అమ్మకాలు జరిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం దాడులు చేసి మద్యం స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని 4వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు.నిజామాబాద్ నగరంలో వైన్సులను కట్టడి చేసిన  ఎక్సైజ్ అధికారులు మాత్రం బార్లను వదిలేశారు. ఇటీవల  కంఠేశ్వర్ లోని వైన్స్ లో అమ్మకాలు జరిపారని మూసి వేశారు. అంతే కాదు కల్లు ముస్తదరులకు వత్తాసు పలుకుతూ నెల నెలా  మామూళ్లు తీసుకుంటూ గీత కార్మికుల పొట్టకొటుతూ కృత్రిమ మత్తు కల్లు తయారీలో ఎక్సైజ్ అధికారులు కీలక పాత్ర ఉన్నట్లు ప్రజలు వాపోతున్నారు.

Related Posts