YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

దేశ ఆర్థిక వ్యవస్థ ని ర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోన్నఎస్ఎంఈలు

దేశ ఆర్థిక వ్యవస్థ ని ర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోన్నఎస్ఎంఈలు

దేశ ఆర్థిక వ్యవస్థ ని ర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోన్నఎస్ఎంఈలు
హైదరాబాద్ ఏప్రిల్ 17
భారతదేశంలో 60 మిలియన్లకు పైగా చిన్న, మధ్యతరహా సంస్థలతో ఎస్ఎంఈ రంగం దేశ ఆర్థిక వ్యవస్థ ని ర్మాణంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఉపాధి అవకాశాలు కల్పించడంలోనైనా, వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామికీకరణలో సహాయం చేయడంలోనైనా, దేశ సామాజిక – ఆర్థికాభి వృద్ధి లోనైనా తన వంతు పాత్ర పోషిస్తూనే ఉంది. నేడు భారతదేశ జీడీపీలో ఎస్ఎంఈల వాటా సుమారు 30శాతంగా ఉంది. ఎ గుమతుల్లో 40 శాతంగా ఉంది. వ్యవసాయ రంగం తరువాత దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నది ఈ రంగమే.ఈ ఊహించని సవాళ్ళ సమయంలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన వాటిలో భారతీయ ఎస్ఎంఈలు కూ డా ఉన్నాయి. లాక్ డౌన్ మరియు దానితో ముడిపడిన బిజినెస్ సెంటిమెంట్స్ ఈ రంగాన్ని దెబ్బ తీశా యి.  లాక్ డౌన్ ప్రారంభం కాగానే మేము ఒక సర్వే నిర్వహించాం. లాక్ డౌన్ ప్రభావం వారిపై ఏ విధంగా ఉందనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఢిల్లీ, బెంగళూరులలోని వివిధ రకాల ఎస్ఎంఈలతో మాట్లాడాం. త యారీ, ట్రేడింగ్, రిటైల్ రంగాలకు చెందిన ఎస్ఎంఈలు వీటిలో ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ, ఎలక్ట్రానిక్స్, మొబైల్ యాక్సెసరీస్, ఐటీ మరియు టెలికాం ఉపకరణాలు, బీ2బీ ఇంజినీరింగ్, లెదర్, ఫ్యాషన్ యాక్సెసరీస్ వంటి విభాగాల్లో అవి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ సర్వేలో వెల్లడైన అంశాలు ఎంతో నిరాశాపూ రితంగా ఉన్నాయి.ఈ లాక్ డౌన్ ఎస్ఎంఈలలో 90% వాటిపై ప్రభావం కనబర్చింది. ఎస్ఎంఈలు, మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ విభాగాలకు చెందినవి గత ఏడాదితో పోలిస్తే, తమ వ్యాపారంలో 35 శాతం నష్టపోయాయి.99శాతం సంస్థలు సిబ్బంది తగ్గింపు లాంటి తీవ్రమైన చర్యలు తీసుకునే విషయంపై ఆలోచిస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితి గనుక కొనసాగితే, ఎస్ఎంఈలలో 90 శాతం 3 నెలలు మాత్రమే అవి కొనసా గేందుకు అవసరమైన క్యాష్ ఫ్లో లను కలిగిఉన్నాయి. బ్యాంకు రుణాలు తీసుకున్న వాటిలో 17 శాతం తిరిగి వాటిని చెల్లించగలిగే స్థితిలో ఉండవు. ఒక సానుకూల అంశం ఏమిటంటే, 99 శాతం ఎస్ఎంఈలు ఇలాంటి కష్టకాలంలో ఆన్ లైన్ ఉనికి తమకు సాయపడగలదని భావిస్తున్నాయి. ఒక నెల రోజుల్లో కొంతమేరకు పరిస్థితి కుదుటపడ గలదని 70% సంస్థలు అంచనా వేస్తున్నాయి.భారతీయ ఎస్ఎంఈ రంగం తిరిగి పుంజుకోవాలంటే ఏం చేయాలి? వాటి మాటల్లోనే చెప్పాలంటే, ఎస్ఎంఈ లు మరింత లీనర్ (తక్కువ సిబ్బంది) అయ్యేందుకు మరియు మరింత వినూత్నంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. క్యాష్ ఫ్లో లను కాపాడుకునేందుకు వ్యయాలను నియంత్రించుకుంటున్నాయి. తమ అవుట్ రీచ్ ను అధికం చేసుకునేందుకు, కొత్త కస్టమర్లను పొందడంలో, విక్రయాలను అధికం చేసుకునేం దుకు సాయపడగల సాంకేతిక పరిష్కారాలను కనుగొంటున్నాయి.అయితే, ఇక్కడ ప్రశ్న ఒక్కటే – ఇది మాత్రమే సరిపోతుందా ? అందుకు సమాధానం – సరిపోదు. కోవిడ్ -19 సంక్షోభం భారతీయ ఎస్ఎంఈ లను, వాటి సమస్యలను, వృద్ధి చెందడంలో అవి ఎదుర్కొనే సవాళ్ళను మరింతగా పరిశీలించేందుకు ఓ సరైన అవకాశం కల్పించింది. ఎస్ఎంఈలతో సన్నిహితంగా కలసి పని చేసిన అనుభవం మరియు ఆ రంగానికి సంబంధించిన కష్టనష్టా లను అర్థం చేసుకోవడం ద్వారా ఈ కష్టకాలంలో ఎస్ఎంఈలు వృద్ధి చెందేందుకు దిగువ చర్యలు తీసుకో వడం అవసరం ఎంతైనా ఉంది.  రుణ మరియు ద్రవ్యలభ్యత మెరుగుదల పెనాల్టీ రహిత వడ్డీ చెల్లింపులకు వీలు కల్పించేలా బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలను ప్రోత్స హించాలి మరియు వర్కింగ్ క్యాపిటల్ పై వడ్డీ ఉండకూడదు.ఎస్ఎంఈలకు ఫైనాన్స్ కు సకాలంలో యాక్సెస్ ఉండాలి. ఎస్ఎంఈ రంగంలో డెవలప్ మెంట్ ఫైనాన్స్ అవసరాలను మెరుగైన రీతిలో తీర్చగలగాలి.ఎస్ఎంఈలకు చెల్లింపులను నిలిపిఉంచకుండా పెద్ద సంస్థలను ప్రోత్సహించాలి. కంపెనీలు మరి యు వాటి సరఫరా చెయిన్స్ ను టిఆర్ఇడిఎస్ వేదికపైకి తీసుకువచ్చేందుకు మరియ దాని ద్వా రా ప్రోత్సహకాలు అందించేందుకు ప్రభుత్వానికి ఇదో చక్కటి అవకాశం. తాత్కాలిక వేజ్ సబ్సిడీ. తద్వారా ఎస్ఎంఈలు రిట్రెంచ్ మెంట్ మరియు లేఆఫ్ లను తప్పించుకోగలుగుతాయి.ఎస్ఎంఈలకు (యజమానులు మరియు కార్మికులు) అందుబాటు రేట్లకు ఆరోగ్య బీమా ను తప్పనిసరి చేయాలి. ప్రతికూలత అనేది ఓ అవకాశంగా మారితే, ఇప్పటి సమయాన్ని మించింది మరొకటి ఉండదు. క్రెడిట్ ఫ్లో, కార్మికత, దయనీయ మౌలిక వసతులు, సాంకేతికత మరియు డిజిటల్ అంతరం లాంటి లాంటి ప్రాథమిక అంశాలను పరిష్కరించేందుకు తోడ్ప డేందుకు  ప్రభుత్వం ఇచ్చే భారీ ఊతం ఈ సంక్షోభంలో ఎస్ఎంఈలకు మద్దతును అందించడం మాత్రమే గాకుండా అవి మరింత పటిష్ఠం అయ్యేందుకు కూడా తోడ్పడుతుంది.కోవిడ్ -19 లాక్ డౌన్ సంబంధిత ప్రభావాల్లో ఒకటి అత్యవసర సరఫరాల కొరత. తమ రోజువారీ అవసరాలను ఎలా తీర్చుకోవాలని లక్షలాది మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారి గా పెరిగిపోయిన ఆర్డర్లను తట్టుకునేందుకు ఇ-కామర్స్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. చిన్న చి న్న కిరాణాలు సైతం ఆన్ లైన్, ఆఫ్ లైన్ హైబ్రిడ్ మోడల్ కు మారుతున్నాయి. పెద్ద సప్లయ్ చెయిన్స్ లోకి ప్రవేశించడం అనేది చిన్న కిరాణాలకు ఓ చక్కటి అవకాశంలో ఓ స వాల్ గా ఉంటోంది. రవాణా, లేబర్ సమకూర్చుకోవడంలోనూ సమస్యలు ఉంటాయి. ఈ నేపథ్యం లో ఇలాంటి సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఈ వ్యవస్థ నిరంతరం వినూత్నత కోసం అన్వేషిస్తోంది.ఎస్ఒఎల్వీనే ఉదాహరణగా తీసుకుంటే, అది తన బి2బి కామర్స్ వేదికను ఉపయోగించుకోవడం లో ఎస్ఎంఈలకు కొత్త మార్గాలను అందిస్తోంది. మా ఆన్ –గ్రౌండ్ జట్లు వస్తువుల నిరాటంక రవాణాకు సంబంధించి ప్రభుత్వ అధికారులతో కలసి పని చేస్తున్నాయి. అంతేగాకుండా మేము కిరాణాలకు, ఆర్ డబ్ల్యూఏలు, ఎన్జీవోలకు, చిన్న ఆసుపత్రులకు నిత్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు గాను  ద్వితీయ శ్రేణి తయారీదారులు, పల్లెలు వంటి సోర్సింగ్ యూనిట్లను మరియు డెలివరీ చానల్స్ ను అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 10,000కు పైగా కుటుంబాలకు ప్రతిరోజూ నిత్యావసరాలు సరఫరా చేయబడుతున్నాయి.
 

Related Posts