YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పక్కా ప్లానింగ్ లేక లెక్క తప్పుతోందా?

పక్కా ప్లానింగ్ లేక లెక్క తప్పుతోందా?

పవన్ కల్యాణ్... యూత్ లో ఓ వైబ్రేషన్. ప్రజలను ప్రభావితం చేయగల వ్యక్తి. ఆయనలో ఆవేశం, గుండె నిబ్బరం, మొండి ధైర్యం మెండుగా ఉన్నాయి. అయితే పొలిటికల్ గా మాత్రం ఆయన పర్ఫార్మెన్స్ పైనే కొన్ని అనుమానాలు. ఆవేశంతోనే ఆయన నిర్ణయాలు తీసేసుకుంటున్నారని.. ఆలోచనాత్మకంగా అడుగులు వేయడంలేదని టాక్. బీజేపీ మద్దతుదారు అని ఇటీవలిగా ఊపందుకున్న విమర్శను తప్పించుకునేందుకు.. ఆయన లెఫ్ట్ పార్టీలకు దగ్గరవుతున్నారని అంతా అంటున్నారు. వామపక్షాలతో ఉంటే సేఫ్ సైడ్ లో ఉండొచ్చని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. బీజేపీ, టీడీపీ, వైసీపీలకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకునేందుకు ఆయన లెఫ్ట్ గ్రూప్ తో జట్టు కట్టారు. జాతీయస్థాయిలో బలంగా ఉన్న బీజేపీ సూచనల ప్రకారమో.. లేక టీడీపీ, వైసీపీల ప్లాన్ లో భాగంగానో తాను వ్యవహరించడంలేదని నిరూపించుకునేందుకే పవన్ ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే 'బీజేపీకి అనుకూలంగా ఉన్నారన్న' విమర్శను తప్పించుకోవడంలో పవన్ తడబడుతున్నారు. 

విమర్శలు, ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొని.. మంచి పదునైన వ్యూహంతో జనసేనాని ముందడుగేయొచ్చు. కానీ ఆయన వామపక్షాలతో చేయి కలపడం ప్లానింగ్ లేమి అని చెప్పకతప్పదు. ఎందుకంటే పవన్ భోళా మనిషి. మనసులో ఉన్నది బాహాటంగా చెప్పేస్తారు. సందర్భానుసారం ఎలా మాట్లాడాలో ఆయనకు పెద్దగా తెలీదు. ఈ లక్షణాల వల్లే ఆయన రాజకీయంగా విమర్శలపాలవుతున్నారు. పొలిటికల్ గా అనుభవం లేకపోవడం వల్లే ఇలా జరుగుతోంది.  హోదా-ప్యాకేజీ అంశాలపై ఇటీవల పవన్ వ్యాఖ్యానాలు వివాస్పదమయ్యాయి. ఇక వైసీపీ, టీడీపీలు కేంద్రప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాలపైనా ఆయన వైఖరి విభిన్నంగా ఉంది. ఫలితంగా పవన్ వెనుక బీజేపీ ఉందని.. కమలనాథుల ప్లాన్ ప్రకారమే జనసేనాని తన విధానాలు మార్చుకున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. అంతకు ముందు ఆయన్ను టీడీపీ మద్దతుదారుగా విమర్శించేవారు. వైసీపీతోనూ పవన్ కు లోపాయికారీ ఒప్పందం ఉందన్న ఆరోపణలూ వినిపించాయి. 

జనసేనతో జట్టు కడితే.. ఆ పార్టీకి ప్రయోజనాలు పెద్దగా లేకున్నా.. వామపక్షాలకు మాత్రం బెనిఫిట్స్ భారీగా ఉంటాయి. మసకబారిన వారి ఇమేజ్ కు మెరుపులు వస్తాయి. అయితే లెఫ్ట్ పార్టీలతో దోస్తీ వల్ల జనసేనకు పెద్దగా ఉపయోగం ఉండదు. అలాంటి రాజకీయ పక్షాలతో ముందడుగేసి.. పాపులార్టీ షేర్ చేసుకునే కంటే.. ఒంటరిగానే బరిలోకి దిగితే పవన్ పార్టీకి ప్లస్ అవుతుంది. కానీ జనసేనాని ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. ఇతర పార్టీల ఎఫెక్ట్ తనపై ఉంటోందన్న కామెంట్స్ కు పవన్ బెదిరిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో తమ ఇమేజ్ కు గండిపడుతుందన్న భయం ఆయన్ను పీడిస్తోంది. దీంతో ఈ గోల నుంచి బయటపడడంపైనే పవన్ ఫోకస్ పెట్టారని సమాచారం. అందుకే లెఫ్ట్ పార్టీలతో ఉంటే బతికిపోవచ్చని.. సమస్య నుంచి బయటపడొచ్చని ఆయన భావిస్తున్నారు. అయితే రాజకీయాల్లో తాత్కాలిక ప్లాన్స్ సత్ఫలితాన్నివ్వలేవు. విస్తృత ప్రయోజనాలు తీసుకురాలేవు. ఈ విషయం పవన్ గుర్తించాలి. జనసేనకు సమర్ధవంతమైన ప్లాన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Related Posts