YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

రివర్స్ రేపో రేటును తగ్గించిన ఆర్బీఐ

రివర్స్ రేపో రేటును తగ్గించిన ఆర్బీఐ

రివర్స్ రేపో రేటును తగ్గించిన ఆర్బీఐ
ముంబాయి ఏప్రిల్ 17
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రివర్స్ రెపో రేటును ఆర్బీఐ 4శాతం నుంచి 3.75శాతానికి తగ్గించింది. మైక్రో ఫైనాన్స్ సంస్థలకు రూ.50 వేల కోట్ల రూపాయలు, జాతీయ హౌసింగ్ బోర్డుకు రూ.పది వేల కోట్లు,  నాబార్డ్ కు పాతిక వేల కోట్ల రూపాయలు, ఎస్ఐబీబీఐకి పదిహేను వేల కోన్ల రూపాయలు, అలాగే చిన్న తరహా పరిశ్రమలకు 50 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం పేర్కొన్నారు.  కరోనా ప్రభావం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిందని చెప్పిన ఆయన 1930 తరువాత ఇంతటి సంక్షోభం ఎన్నడూ ఎదురుకాలేదని పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్లన్నీ సంక్షోభంలో ఉన్నాయని చెప్పిన శక్తికాంత్ దాస్,  జీ-20 దేశాల్లో భారత్ పరిస్థితే మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. 2020లో భారత వృద్ధి రేటు 1.9శాతంగా ఎంఎంఎఫ్ అంచనా వేసిందన్నారు. 2021-2022 నాటికి వృద్ధి రేటు 7.4గా అంచనా వేసినట్లు తెలిపారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు సరిపడా ఉన్నాయన్నారు. 90శాతంపైగా ఏటీఎంలు పని చేస్తున్నాయన్నారు.
 

Related Posts