6.8 శాతానికి పడిపోయిన చైనా జీడీపీ
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 17
కొన్ని దశాబ్ధాల తర్వాత తొలి సారి చైనా ఆర్థిక వ్యవస్థ పతనమైంది. ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో వృద్ధి రేటు తగ్గింది. అధికారిక డేటా ప్రకారం చైనా జీడీపీ 6.8 శాతానికి పడిపోయినట్లు తెలుస్తోంది. 1992 తర్వాత ఆ దేశ జీడీపీ తగ్గడం ఇదే తొలిసారి. కరోనా వైరస్ వల్ల ఫ్యాక్టరీలు, వ్యాపారాలు మూతపడడంతో.. ఈ పతనం కనిపించింది. చైనా ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడడం వల్ల .. అది మిగితా దేశాలపైన కూడా చూపించనున్నది. గత ఏడాది తొలి క్వార్టర్‌లో చైనా ఆర్థిక వృద్ధి 6.4 శాతంగా నమోదు అయ్యింది. అమెరికాతో వాణిజ్య కయ్యం ఉన్నా.. చైనా ఇటీవల ప్రగతి సాధించింది. గత రెండు దశాబ్ధాలుగా చైనా ఆర్థిక వృద్ధి రేటు ఏడాదికి 9 శాతంగా రికార్డు అయ్యింది. ఆ డేటాపై మాత్రం నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.