డిల్లీలోని తెలంగాణ భవన్ లో ఎంపీలు, ఎమ్మెల్యేల సహాయక కార్యాలయాన్ని టీఆర్ఎస్ ఎంపీలు గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా రాజ్యసభ సభ్యుడు కేశవ రావు మాట్లాడుతూ ఎంపీలకు అవసరమైన సదుపాయాల కల్పనకు ఒక ఉపయోగకరంగా ఈఫెసిలిటషన్ సెంటర్ ఉంటుంది. రాబోయే రోజుల్లో మరింత ఉపయోగపడేలా సిద్ధం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన చాలా బాగుంది అని నిన్న మన్మోహన్ సింగ్ మెచ్చుకున్నారు. బిల్స్ ఏవైనా అశాస్త్రీయంగా జరిగిన దాఖలాలు లేవని అన్నారు. మీకు బిల్లు పాస్ అవ్వడం మీకు ఇష్టం లేకపోతే పార్లమెంట్ నుండి బయటికి వెళ్లిపోవాల్సిందని అన్నారు. టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీలు అందరికి చాలా బాధాకరంగా ఉంది. తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవడానికి, పార్లమెంటులో చర్చిద్దామని అనుకుంటే అంతా డ్రామా లాగానే సాగిందని అన్నారు రిజర్వేషన్ల విషయంలో స్పష్టత వస్తుందనుకుంటే రాకుండా పోయింది. కేంద్రం వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ మా సమస్యలను పరిష్కరించకపోవడం బాధాకరమని అన్నారు. రాబోయే రోజుల్లోనైనా పార్లమెంట్ సమావేశాలు సరిగ్గా జరిగి సమస్యల పరిష్కరించదిశగా ఉంటుందని ఆశిస్తున్నాం. మేము థర్డ్ ఫ్రంట్ అని ఎప్పుడూ చెప్పలేదు. ఫెడరల్ ఫ్రంట్ దిశగానే అడుగులు వేస్తున్నాం. పార్టీలను దగ్గరికి తీసుకొచ్చి అధికారం కోసం వెంటపడట్లేదని అన్నారు.