YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

వరి ధాన్యం కొనుగోలుకు కాల్ సెంటర్ ప్రారంభం

వరి ధాన్యం కొనుగోలుకు కాల్ సెంటర్ ప్రారంభం

రైతులు ఏ విధమైన భయాందోళన చెందకూడదు


జిల్లా కలెక్టర్ గోగులోతు రవి



వరి ధాన్యం కొనుగోలుకు కాల్ సెంటర్ ప్రారంభం
జగిత్యాల, ఏప్రిల్, 17
రైతులు ఏ విధమైన భయాందోళన చెంద కూడదని, ఎవరైనా చెప్పినాను అపోహలు నమ్మకూడదని రైతు పండించిన ప్రతి చివరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జగిత్యాల జిల్లా కలెక్టర్ గోగులోతు రవి అన్నారు.శుక్రవారం జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కాల్ సెంటర్ ను డీఎస్ఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జి. రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రబీ సీజన్లో జిల్లాలో 389 కొనుగోలు కేంద్రాలకు గాను 157 కేంద్రాలను ప్రారంభించు కోవడం జరిగిందని అన్నారు. ఐకెపి, ఫ్యాక్స్ ద్వారా నిర్వహించబడుతుంది అని జిల్లాలో రెండు లక్షల 47 వేల ఎకరాలలో సాగు చేయడం జరిగిందని ఈసారి ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతోందని అన్నారు ప్రతి మండలానికి  జిల్లాస్థాయి అధికారిని ఏర్పాటు చేశామని , ప్రతి సెంటర్ కు వీఆర్వో హోదాలో కలిగిన ఉద్యోగిని నియమించినట్లు వారు ప్రతిరోజు వరి ధాన్యం కొనుగోలు ఎంత చేశారు, ఎంత మిల్లర్లకు పంపాము అనే వాటిని త్వరితగతిన పూర్తి చేయుటకు సహకరిస్తారని. అదేవిధంగా మిల్లుల దగ్గర కూడా ఒక అధికారిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అతను వచ్చిన వరి ధాన్యాన్ని త్వరితగతిన దింపుకోవడం మరలా వెంటవెంటనే వాహనాలను పంపుతూ ఎక్కడ ఎలాంటి  సమస్యలు అయినను తన స్థాయిలో పరిష్కరిస్తాడు, లేదా పై అధికారులకు తెలియజేస్తూ సమస్యలను వెంటవెంటనే పరిష్కరించుటకు సహకరిస్తారని అన్నారు. ఈ కాల్ సెంటర్ ద్వారా ప్రతి కొనుగోలు కేంద్రాలకు ఫోన్ చేసి అక్కడ ఏ విధమైన సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరిస్తారని, అదేవిధంగా రైతులకు ఏ విధమైన సమస్యలు ఉన్నట్లయితే కాల్ సెంటర్కు ఫోన్ చేసిన ఎడల వారి పేరుతో సహా సంబంధిత రిజిస్టర్ లో నమోదు చేసుకొని ఆ సమస్యను పరిష్కరించి కంప్లైంట్ చేసిన అభ్యర్థికి సమస్యను పరిష్కరించి తిరిగి అభ్యర్థికి పరిష్కరించినట్లు తెలియజేస్తారు. కాల్ సెంటర్ నెంబర్.18004258187 వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన విషయాలను ఎవరైనను తెలపవచ్చు అని అన్నారు. కాల్ సెంటర్ లో 12 మంది పని చేస్తుంటారని ఉదయం 8 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మరియు రెండు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రెండు షిఫ్ట్ లో పని చేస్తారని అన్నారు. రైతుల ధాన్యాన్ని ఏ కొనుగోలు కేంద్రానికి టాకింగ్ చేస్తే ఆ కొనుగోలు కేంద్రానికి మాత్రమే తీసుకొని వెళ్లాలన్నారు.  కరోనా వైరస్ అదృశ్య రైతులందరూ ఒకరికొకరు సామాజిక దూరాన్ని పాటించాలని అన్నారు. రైతులు ఏ విధమైన భయాందోళన చెంద కూడదని ఎవరైనా చెప్పినాను అపోహలు నమ్మకూడదని రైతు పండించిన ప్రతి చివరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రం పరిధిలో గల రైతులందరి పంట చివరి గింజ కొనుగోలు పూర్తి అయిన తర్వాతనే సెంటర్ ను రద్దు పరచడం జరుగుతుందని అప్పటివరకూ కొనుగోలు కేంద్రము ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ బి రాజేశం, డిఆర్డిఏ పిడి లక్ష్మీనారాయణ, డి సి ఓ రామానుజాచార్యులు, డి.ఎస్.ఒ చందన్కుమార్, డి ఎం సివిల్ సప్లై రజినీకాంత్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు పాల్గొన్నారు.
 

 

Related Posts