YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఉపయోగంలోకి ఎప్పుడు వచ్చేనో?

ఉపయోగంలోకి ఎప్పుడు వచ్చేనో?

ఇంటింటికీ తాగునీరు అందించేందుకు తెలంగాణ సర్కార్ మిషన్ భగీరథ పథకం చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటూ త్వరలోనే నీటి సరఫరా చేపట్టాలని భావిస్తోంది. అనేక జిల్లాల్లో తాగునీటి సమస్యలకు చెక్ పెట్టే ఈ పథకాన్ని సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ప్రభుత్వ ఆశయానికి తగ్గట్లుగా పలు ప్రాంతాల్లో ప్రాజెక్టు పనులు వేగంగా సాగడంలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ పథకంలో భాగంగా నిర్మించాల్సిన పలు ట్యాంకులు టార్గెట్ కు సమీపంలోనే లేవని మహబూబాబాద్ వాసులు అంటున్నారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. మార్చ్ 15కే అన్ని గ్రామాలకు తాగునీరు అందించాలని అధికారులు కాంట్రాక్టర్లకు సూచించారు. అయితే ఇప్పటికే పూర్తైన పనులు ఉపయోగంలోకి రాని పరిస్థితి నెలకొంది. మరోవైపు వేసవి ఎఫెక్ట్ తీవ్రమవడంతో స్థానికంగా తాగునీటికి కటకట ఏర్పడుతోంది. ప్రజలు తాగునీటి కోసం సతమతమవుతున్నారు. ఫథకం త్వరితగతిన పూర్తైతే తాగు నీటికి సమస్యలు తొలిగే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. 

 

భగీరథ ప్రాజెక్టులో భాగంగా మహబూబాబాద్ కు 843 ట్యాంకులు మంజూరయ్యాయి. అయితే ఇప్పటికీ ఒక్క ట్యాంక్ కూడా పూర్తి కాలేదు. 281 ట్యాంకులు నిర్మాణంలో ఉండగా 562 ట్యాంకులకు సంబంధించిన పనులు ప్రారంభించాల్సి ఉంది. జయశంకర్ జిల్లాలో 686 ట్యాంకులు మంజూరు కాగా 35 మాత్రమే పూర్తయ్యాయి. జనగామలో 436 మంజూరైతే 407 పూర్తయ్యాయి. వరంగల్ అర్బన్ లో 161 మంజూరు అయితే 23 పూర్తయ్యాయి. ఇక వరంగల్ రూరల్ లో 464 ట్యాంకులకు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. మొత్తంగా మహబూబాబాద్, వరంగల్ రూరల్ లో ఒక్క ట్యాంకు కూడా పూర్తి అయినది లేదు. దీంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వేసవిలో నీటి ఎద్దడిని, తాగునీటి సమస్యలను దృష్టించి పనులు త్వరితగతిన సాగేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసి ప్రతీ ఇంటికీ తాగునీరు అందించాలని విజ్ఞప్తిచేస్తున్నారు. 

Related Posts