YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 పొలిటికల్ డిస్టెన్స్ పాటిస్తున్న గంట

 పొలిటికల్ డిస్టెన్స్ పాటిస్తున్న గంట

 పొలిటికల్ డిస్టెన్స్ పాటిస్తున్న గంట
విశాఖపట్టణం, ఏప్రిల్ 18
ఆయన అధికారంలో ఉంటే అన్నింటా తానే కనిపిస్తారు. పదవి దిగిపోయాక అంతే నిబ్బరంగానూ ఉండగలరు. విశాఖ నుంచి కాంగ్రెస్ మంత్రిగా 2012లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో బాధ్యతలు స్వీకరించిన గంటా శ్రీనివాసరావు ఆ తరువాత టీడీపీలో చేరి అక్కడ నుంచి మరో అయిదేళ్ళ పాటు మంత్రి హోదాను అనుభవించారు. ఇలా సుదీర్ఘంగా, ఏకాండిగా ఏడేళ్ళ పాటు జిల్లా నుంచి మంత్రిగా కొనసాగిన వారు గంటా తప్ప వేరొకరు లేరు. అదొక రికార్డు. ఇక 2019 ఎన్నికల్లో ఎందరో ఉద్ధండులు ఓటమి పాలు అయినా కూడా జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ గెలవడం ఒక్క గంటా శ్రీనివాసరావుకే సాధ్యపడిందని అంటారు.గంటా శ్రీనివాసరావు తెలివైన రాజకీయ నేత. మాటలను సైతం తూకంగా వాడతారు. తన అవసరం ఉందంటేనే పెదవి విప్పుతారు. లేదంటే గమ్మునుంటారు. ఇపుడు గంటా శ్రీనివాసరావు చేస్తున్నది అదే. పది నెలలు మాజీ మంత్రిగా కాలం గడచిపోయింది. ప్రభుత్వం మీద అందరి టీడీపీ నేతల మాదిరిగా మీడియా ముందుకు వచ్చి అర్ధం పర్ధం లేని విమర్శలు చేయరు. ఏదైనా మాట్లాడితే నిర్మాణాత్మకంగానే ఉండాలనుకుంటారు. అందుకే తమ నేత ఇపుడు ఫుల్ సైలెంట్ అంటున్నారు అనుచరులు.మరో వైపు కరోనా విప‌త్తుతో దేశమంతా కకావికలమవుతోంది. గంటా శ్రీనివాసరావు మాత్రం తాపీగా ఏకాంతవాసం గడుపుతున్నారు. మధ్యలో అయన ఒకసారి ముఖ్యమంత్రి జగన్ కి లేఖ రాశారు. విశాఖలో క‌రనా ల్యాబ్ పెట్టమన్నారు. ప్రభుత్వం ఎటూ అది మంజూరు చేసింది. దాంతో తాను అడిగిన దానికి వచ్చిన ప్రతిఫలంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ఖాతాలో వేసుకున్నారు. సర్కారుపై బురద జల్లుడు రాజకీయాలు చేయడం, పరువు పోగొట్టుకోవడం వంటి దిగజారుడు పనులకు గంటా దిగకుండా దూరం పాటిస్తున్నారు.ఇపుడు చూసుకుంటే విశాఖ జిల్లా రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్నారు. మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రాజకీయ జీవితం దాదాపుగా క్లైమాక్స్ వచ్చేసినట్లేనని అంతా అంటున్న మాట. మరో వైపు చూసుకుంటే వైసీపీలో ఉన్న నాయకులు కూడా ఒకపుడు గంటా శిష్యులు అనుచరులే. దాంతో జిల్లాల్లో పెద్ద తలకాయగా గంటాయే కనిపిస్తున్నారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి పెద్ద బలం అన్న మాట కూడా ఉంది. అర్ధబలం, అంగబలం పుష్కలంగా ఉండడమే కాదు, సమయానుకూలంగా రాజకీయం చేయడంతో దిట్ట అయిన గంటా శ్రీనివాసరావు కోసం అందుకే అన్ని పార్టీలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. సైలెంట్ గా ఉన్న గంటా ఇపుడు మొత్తం వర్తమాన రాజకీయ ముఖచిత్రంలో బుద్ధిమంతుడుగా కనిపిస్తున్నారు.

Related Posts