YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

భారీగా పెరిగిన రక్త నిల్వలు

భారీగా పెరిగిన రక్త నిల్వలు

భారీగా పెరిగిన రక్త నిల్వలు
అదిలాబాద్, ఏప్రిల్ 18 
సలే ఎండకాలం.. ఆపై లాక్డౌన్.. అత్యవసర సమయంలో రక్తం ఎలాగని తలసేమియా, సికిల్సెల్ బాధిత పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కానీ… ఐఆర్సీఎస్ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుల కృషి, దాతల పెద్దమనసుతో ఈ కష్టకాలంలో రక్తం కొరతను అధిగమించారు. 22 రోజులకు పైగా లాక్డౌన్ కొనసాగుతున్నా పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నారు. బాధితుల పాలిట ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో  పెద్ద సంఖ్యలో తలసేమియా, సికిల్సెల్ బాధితులు ఉన్నారు. వీరికి గత కొన్నేళ్లుగా మంచిర్యాల జిల్లా హాస్పిటల్లోని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ బ్లడ్బ్యాంక్లో ఉచితంగా రక్తం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు జిల్లాల నుంచి 143 మంది తలసేమియా, 430 మంది సికిల్సెల్ బాధితులు రిజిస్టర్ అయి ఉన్నారు. తలసేమియా చిన్నారులకు వారం పది రోజులకు, సికిల్సెల్ పిల్లలకు రెండు మూడు నెలలకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. సకాలంలో రక్తం ఎక్కించకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం. సాధారణ రోజుల్లో ఐఆర్సీఎస్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి రక్తాన్ని సేకరిస్తుంటారు. కొంతమంది దాతలు నేరుగా బ్లడ్బ్యాంక్కు వచ్చి రక్తదానం చేస్తుంటారు. ఇలా ప్రతి నెల 900లకు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరిస్తారు. ఇందులో 250 యూనిట్ల వరకు తలసేమియా, సికిల్సెల్ బాధితులకు, మరో 250 యూనిట్లు సర్కారు దవాఖానాకు వచ్చే ప్రమాద బాధితులు, బాలింతలు, ఇతర రోగులకు అందిస్తారు. ఇంకో 250 యూనిట్లను బయటి వారికి ఇస్తుంటారు. లాక్డౌన్ కారణంగా గత ఇరవై రోజులుగా తలసేమియా, సికిల్సెల్, డెలివరీ కేసులు మినహా ఇతర కేసులు రావడం లేదు.రక్తదాతలు బ్లడ్బ్యాంక్కు వచ్చివెళ్లేటప్పుడు పోలీసులు అడ్డుకోకుండా ఉండేందుకు దాతల వివరాలతో వాట్సాప్ ద్వారా ఈ-పాస్లు ఇస్తున్నారు. ఒక ప్రాంతంలో ఐదారుగురు దాతలుంటే వాహనం పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది ఉంటే లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు భాస్కర్రెడ్డి తెలిపారు.లాక్ డౌన్ వల్ల బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో బ్లడ్బ్యాంక్ నిర్వాహకులు దాతలను ఫోన్లో సంప్రదించి రక్తదానం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. యువజన, సేవా, కుల సంఘాల సభ్యులు, వలంటీర్లు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారు. లాన్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి 287 యూనిట్లు సేకరించగా, 320 యూనిట్లను రోగులకు అందించారు. లాక్డౌన్కు ముందు రెండు మూడు మెగా క్యాంపులు నిర్వహించారు. లాక్డౌన్ నుంచి ప్రతి రోజు పది పదిహేను యూనిట్లు సేకరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం 300 యూనిట్ల రక్తం నిల్వలున్నాయి. మరికొందరు దాతలు ముందుకు వస్తే ఈ గండం నుంచి గట్టెక్కే అవకాశముందని ఐఆర్సీఎస్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్రెడ్డి చెప్పారు.

 

Related Posts