జేఎన్టీయూలో ఆన్ లైన్ క్లాసులు
హైద్రాబాద్, ఏప్రిల్ 19
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో స్టూడెంట్స్‌కు క్లాసులు చెప్పాలని కాలేజీలను ఆదేశించిన జేఎన్టీయూహెచ్, అసలు పాఠాలు చెప్తున్నారా లేదా చెక్ చేస్తోంది. ఏ టీచర్.. ఏ సబ్జెక్టు చెప్పారో మూడ్రోజులకోసారి వివరాలు పంపించాలని కాలేజీల మేనేజ్‌మెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. నెలాఖరు వరకు యూజీ కోర్సుల సిలబస్ పూర్తి చేయాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.జేఎన్‌టీయూహెచ్ పరిధిలో 261 ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏతో పాటు ప్రొఫెషనల్ కాలేజీలున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి16 నుంచి విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులిచ్చింది. జేఎన్టీయూ అకడమిక్ షెడ్యూల్ప్రకారం ఏప్రిల్ఫస్ట్ వీక్ వరకు యూజీ కోర్సుల సిలబస్ పూర్తి చేసి నెలాఖరులో ఎగ్జామ్స్ నిర్వహించాలి. పీజీ కోర్సులకు మే వరకు గడువుంది. కానీ లాక్‌డౌన్ వల్ల సిలబస్ పూర్తి కాలేదు.స్టూడెంట్స్ విద్యాసంవత్సరం నష్టపోకుండా ఆన్‌లైన్‌లో క్లాసులు తీసుకోవాలని అన్ని స్టేట్ వర్సిటీలను గవర్నర్ తమిళిసై ఆదేశించారు. దీంతో ఆన్‌లైన్క్లాసులకు జేఎన్టీయూ ప్రిపేర్ చేసింది. ఈ–మెయిల్ గ్రూపులు, వీడియో లెక్చర్స్, స్కైప్, జూమ్, జిట్సీ మీట్ తదితర ఫ్లాట్ ఫామ్‌లను వాడుకోవాలని కాలేజీలను ఆదేశించింది. అయితే కొన్ని కాలేజీల్లో రెగ్యులర్‌గా క్లాసులు జరగట్లేదని వర్సిటీకి ఫిర్యాదులు రావడంతో వెంటనే రియాక్టయింది. ఏ రోజు, ఏ టీచర్, ఏయే క్లాసులు తీసుకున్నారో మూడ్రోజులకోసారి వర్సిటీకి వివరాలు పంపించాలంది. ఏప్రిల్ 30లోగా సిలబస్ పూర్తి చేయాలంది. తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పింది.జేఎన్టీయూహెచ్పరిధిలో స్టార్ట్ చేసిన ఆన్‌లైన్ క్లాసులకు మంచి రెస్పాన్స్వస్తోంది. దాదాపు అన్ని కాలేజీలూ క్లాసులు చెబుతున్నాయి. కాలేజీల్లో ప్రతి బ్రాంచ్ వారీగా స్టూడెంట్స్‌తో వాట్సాప్ గ్రూప్‌లు చేశారు. ప్రస్తుతం ఇంటి నుంచే స్టూడెంట్లు క్లాసులు వింటున్నారు. రిమోట్ ఏరియాల్లో, సిగ్నల్ సరిగా లేని ప్రాంఆల్లో క్లాసులు వినకపోతే క్లాసుకు సంబంధించిన లింక్ పంపిస్తున్నారు. ఈ నెల30 లోగా సిలబస్ కంప్లీట్ చేయాలని సూచించామంటున్నారు జేఎన్టీయూ అధికారులు.