YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సోనియా పై నెట్ జన్ల ప్రశంసలు

సోనియా పై నెట్ జన్ల ప్రశంసలు

సోనియా పై నెట్ జన్ల ప్రశంసలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18
కరోనా కట్టడి కోసం దేశమంతా ఏకమయింది. ప్రధాని నరేంద్ర మోదీ సయితం అన్ని పక్షాలను, అందరి ముఖ్యమంత్రులను కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారు. వారి అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, కరోనా వైరస్ వ్యాప్తి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. 24గంటలూ తాను అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నారు. అధికార పార్టీలు తప్ప ప్రతిపక్షాలు ఈసమయంలో చేయగలిగిందేమీ లేదు.రాహుల్ గాంధీ తొలినాళ్లలో కరోనా కట్టడిలో విఫలమయ్యారని కొంత విమర్శలు చేసినా ఈ మధ్య కాలంలో ఆయన తగ్గారు. ప్రపంచమంతా మోదీ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసిస్తుండటమే ఇందుకు కారణం కావచ్చు. లాక్ డౌన్ నిర్ణయాన్ని మోదీ సకాలంలో తీసుకోవడంతో భారత్ లో వైరస్ వ్యాప్తికి అడ్డుగట్ట వేయగలిగారని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సర్టిఫికేట్ ఇవ్వడంతో ప్రతిపక్షాలకు ఇక విమర్శించడానికి ఏమీ మిగలలేదు. కొవ్వొత్తులు వెలిగించడంపై కాంగ్రెస్ కొంత అభ్యంతరం చెప్పినా దేశ వ్యాప్తంగా వచ్చిన రెస్పాన్స్ చూసి మిన్నకుండిపోయిందికాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సయితం మంచి సూచనలు చేస్తూ ప్రజల నుంచి మంచి మార్కులే కొట్టేసినట్లు కనపడుతుంది. ఇటీవల సోనియా గాంధీ రాసిన లేఖ, విడుదల చేసిన వీడియోలు సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలకు నోచుకున్నాయి. విమర్శించడానికే ప్రతిపక్షం ఉన్నట్లు కాకుండా మోదీ తీసుకుంటున్న చర్యల గురించి సోనియా గాంధీ ప్రశంసించడం అందరినీ ఆకట్టుకుంది. ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేస్తే బాగుంటుందని సోనియా చేసిన సూచనను కూడా నెటిజన్లు స్వాగతిస్తున్నారు. నిజమైన ప్రతిపక్ష నేతగా సోనియాగాంధీ వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

 

Related Posts