ఇక 10 నిమిషాల్లో ఇన్ ఫెక్షన్ తేల్చే ర్యాపిడ్ టెస్టులు
విజయవాడ, ఏప్రిల్ 18
కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న వేళ.. చైనా నుంచి ఐదు లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు భారత్ చేరాయి. ఆంధప్రదేశ్ ప్రభుత్వం కూడా దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తెప్పించింది. సాధారణంగా కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించడానికి చాలా సమయం పడుతుంది. కానీ ర్యాపిడ్ కిట్ల ద్వారా పది నిమిషాల్లోనే సదరు వ్యక్తిలో ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలుసుకోవచ్చు.ఇంతకూ ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు ఎలా పని చేస్తాయో వాచ్ దిస్ స్టోరీ కరోనా కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీవ్రం చేశాయి. కొత్తగా వచ్చిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో ఇన్ ఫెక్షన్ సోకిందో లేదో తెలిసిపోతుంది. ముఖ్యంగా హాట్ స్పాట్‌లలో కరోనా కేసులను త్వరగా గుర్తించడంలో ఇవెంతగానో ఉపకరిస్తున్నాయి. భారత్‌కు చైనా నుంచి దిగుమతి అయిన టెస్టు కిట్లను లియోజాన్, వాన్‌ఫ్లో అనే రెండు సంస్థలు వేర్వేరుగా రూపొందించాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఈ సంస్థలు రూపొందించిన కిట్లు అత్యంత కచ్చితత్వంతో పని చేస్తాయని ఐసీఎంఆర్‌కు చెందిన డాక్టర్ గంగాఖేద్కర్ తెలిపారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా మన శరీరంలో ఉన్న యాంటీ బాడీలను గుర్తించొచ్చని ఐసీఎంఆర్ ఎపిడిమియాలజీ అండ్ కమ్యూనబుల్ డిసీజెస్-1 డివిజన్‌డాక్టర్ రమణ్ ఆర్ గంగాఖేద్కర్ తెలిపారు. వీటి ద్వారా ఓ వ్యక్తిలో కరోనా ఉందని నిర్ధారించలేం కానీ.. కరోనా లక్షణాలేవీ కనిపించక ముందే వైరస్ ఉందని ప్రాథమికంగా గుర్తించొచ్చు. ఎలాగంటే.. మన శరీరంలోకి ఏదైనా వైరస్ ప్రవేశించినప్పుడు లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ బారిన పడినప్పుడు.. మన శరీరం యాంటీబాడీలను విడుదల చేస్తుంది. సదరు ఇన్ఫెక్షన్‌పై ఈ యాంటీ బాడీలు పోరాడతాయి. దీంతో కొద్ది రోజుల తర్వాతే ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తాయి.మన శరీరం ఇన్ఫెక్షన్ బారిన పడితే ముక్కు, నోటిలోని తెమడలో వైరస్‌ను గమనించొచ్చు. నోరు, ముక్కు భాగాల్లో వైరస్ మరింతగా వృద్ధి చెందుతుంది 8 రోజుల తర్వాత కాబట్టి లక్షణాలు బయటపడతాయి. తర్వాత వైరస్ జాడ తగ్గుముఖం పడుతుంది. ‘‘వైరస్ శరీరంలోకి ప్రవేశించాక వాటితో పోరాడటానికి యాంటీ బాడీలను శరీరం తయారు చేసింది. ఇవి వైరస్‌కు పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి వైరస్‌ను నిర్మూలిస్తాయి. ఈ యాంటీ బాడీల్లో అనేక రకాలు ఉంటాయి. శరీరంలో ఐజీఎం యాంటీబాడీ కనిపిస్తే.. ఇటీవలే ఆ వ్యక్తి ఇన్ఫెక్షన్ బారిన పడ్డాడని భావించొచ్చు. ఐజీజీ యాంటీ బాడీ కనిపిస్తే.. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఐజీఎం యాంటీ బాడీలు లేకుండా, ఐజీజీ యాంటీబాడీలు మాత్రమే కనిపిస్తే.. అది పాత ఇన్ఫెక్షన్ అని భావించవచ్చుర్యాపిడ్ టెస్టు కిట్ల ద్వారా శరీరంలోని యాంటీ బాడీలను గుర్తిస్తారు, ఇవి వ్యాధి నిర్ధారణ కోసం కాదంటున్నారు డాక్టర్లు. చికెన్‌పాక్స్ యాంటీ బాడీలు శక్తివంతమైనవి కాబట్టి.. ఈ వ్యాధి మళ్లీ మనకు రాదు. కానీ హెచ్ఐవీ యాంటీ బాడీలు మాత్రం ఆ వైరస్ బారిన నుంచి కాపాడలేవు. ఇప్పటి వరకూ ఆర్‌టీ - పీసీఆర్ విధానమే కరోనాను గుర్తించడంలో అత్యుత్తమైనదిగా భావిస్తారు. పీసీఆర్ విధానంలో అనుమానితుడి ముక్కు, నోరు నుంచి శాంపిళ్లను సేకరిస్తారు. రిజల్ట్ రావడానికి ఐదు లేదా ఆరు గంటల సమయం పడుతుంది. ర్యాపిడ్ టెస్టింగ్‌లో రక్త నమూనాలను సేకరిస్తారు. దీనికి పది నిమిషాల్లో ఫలితాలొచ్చే అవకాశం ఉంది.ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్టులను నిర్వహించేది కేవలం కరోనా వ్యాప్తిని ఓ కంట కనిపెట్టడానికే కానీ కచ్చితమైన వ్యాధి నిర్ధారణ కోసం కాదు. ఎందుకంటే ర్యాపిడ్ టెస్టుల్లో యాంటీ బాడీలు కనిపిస్తే తర్వాత కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టొచ్చు. అంటే ఓ వ్యక్తిలో లక్షణాలేవీ కనిపించక ముందే యాంటీ బాడీల ఆధారంగా ముందు జాగ్రత్త పడొచ్చు. ఇన్ఫెక్షన్‌కు గురైన పది రోజులు లేదా రెండు వారాల తర్వాత పేషెంట్ల శరీరంలో 80 శాతం మాత్రమే యాంటీ బాడీలు కనిపిస్తాయి. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ర్యాపిడ్ టెస్టులను చేపట్టడం ద్వారా అధికారులు ఇన్ఫెక్షన్ వ్యాప్తి గురించి సమాచారం పొందే అవకాశం ఉంటుంది...