విజయవాడ : బాబూ జగ్జీవన్రామ్ అతి చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రామవరప్పాడు రింగ్ రోడ్ లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పేదరికం లేని సమాజం చూడాలన్నదే తన ధ్యేయంగా చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్రామ్ తనకు స్ఫూర్తి అని ఆయన అన్నారు. దళితులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరింఆచరు. జగ్జీవన్రామ్ వివిధ పదవులు అలంకరించి ప్రజాప్రయోజనాలు కాంక్షించారన్నారు. ఆహార భద్రతకు నాంది పలికింది బాబూ జగ్జీవన్రామ్ అన్నారు. రాజ్యాంగం రాసినా వాటిని అమలు చేసిన వ్యక్తుల పనితీరుపై ఆధారపడి ఉంటుందని అంబేద్కర్ అన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చట్టాలు చేయటం కంటే వాటిని అమలు చేయడంలోనే రాజ్యాంగ స్ఫూర్తి కనిపిస్తుందన్నారు. ప్రస్తుతం చట్టాలను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని , అందుకే సంక్షోభాలు తలెత్తుతున్నాయన్నారు. దళితుల జీవన ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం అన్నారు. డప్పు కళాకారులకు పింఛన్లు ఇస్తున్నామన్నారు.