కరోనా వేళ ప్రయాణాలపై ఆంక్షలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18
కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా విధించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌వేళ భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీయుల వీసాల గడువును కేంద్ర ప్రభుత్వం తాజాగా మే 3 వరకు పొడిగించింది. మరోవైపు విదేశీయులకు ఇచ్చిన వీసాలను మే 3 వరకు సస్పెండ్ చేసినట్లు కేంద్ర హోమంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇందులో డిప్లోమాట్స్, యూఎన్ అధికారుల వీసాలకు మినహాయింపునిచ్చినట్లు పేర్కొంది. మరవైపు కరోనా వేళ విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఫిబ్రవరి 1 నుంచి మే 3 వరకు ఈ అదేశాలు అమల్లో ఉంటాయని కేంద్రం తెలిపింది. మరోవైపు ఇండియాలో చిక్కుకుపోయిన విదేశీయులకు ఫారినర్స్ రీజినల్ ఆఫీస్, ఫారినర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆధ్వర్యంలో కాన్సులర్ సర్వీస్‌లను పొడిగించనున్నట్లు పేర్కొంది. మరోవైపు విదేశీయుల అభ్యర్థనపై మరో 14 రోజులపాటు వీసా గడువును పొడిగిస్తామని తెలిపింది.మరోవైపు మే 3 వరకు ఇండియాలోని వచ్చే వారి కోసం ఉద్దేశించిన 107 ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టులను మూసివేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అయితే అత్యవసవర, నాన్ ఎసెన్సియల్ సర్వీసెస్ అందించే వాహానాలు, విమానాలు, ఓడలు, ట్రైన్లకు ఇది వర్తించదని తెలిపింది. మరోవైపు ఇందులో ప్రయాణించి వచ్చేవారిని కోవిడ్-19కు సంబంధించి మెడికల్ స్క్రీనింగ్ చేశాకే అనుమతిస్తామని తెలిపింది.