100 మిలియన్లను దాటేసిన శ్రీ మంతుడు
హైద్రాబాద్, ఏప్రిల్ 18
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘శ్రీమంతుడు’. ‘ఆగడు’ వంటి డిజాస్టర్ తరవాత వచ్చిన ఈ సినిమా మహేష్ మార్కెట్‌ను అమాంతం పైకి లేపింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే వదలకుండా చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. అయితే, ఈ సూపర్ హిట్ మూవీ ఒక అరుదైన ఘనతను సాధించింది. యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమా ఇది.ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 2017 సెప్టెంబర్ 13న అప్‌లోడ్ చేసింది. ఇప్పటి వరకు 100 మిలియన్లకు పైగా సార్లు ఈ సినిమాను చూశారు. మూడు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. థియేటర్‌లో విడుదలై, టీవీల్లో పలు సార్లు ప్రసారమైన సినిమాను ఈ స్థాయిలో యూట్యూబ్‌లో చూడటం నిజంగా ఆశ్చర్యకరమే. సాధారణంగా తెలుగు నుంచి హిందీలోకి డబ్బింగ్ అయిన సినిమాలకు ఈ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. కానీ, తెలుగులోనే ఈ రేంజ్‌లో వచ్చాయంటే అది మహేష్ బాబు స్టామినా వల్లే అని చెప్పుకోవాలి.కాగా, ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. జగపతిబాబు, సంపత్ రాజ్, రాహుల్ రవీంద్రన్, అలీ, వెన్నెల కిషోర్, హరీష్ ఉత్తమన్, రాజేంద్రప్రసాద్, సుకన్య, ముఖేశ్ రుషి ముఖ్య పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్, మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై మహేష్ బాబు, నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మోహన్ సంయుక్తంగా నిర్మించారు. కొరటాల శివ దర్శకత్వంలో తొలిసారి మహేష్ బాబు చేసిన ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.