YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పర్యవేక్షణ తగ్గింది..నిర్వహణ కష్టమవుతోంది..

పర్యవేక్షణ తగ్గింది..నిర్వహణ కష్టమవుతోంది..

కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో తడి-పొడి చెత్త నిర్వహణ మొదట్లో పక్కాగా నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే సమయంలో అయితే ఎక్కడి చెత్తను అక్కడే తగ్గించేలా చర్యలు తీసుకున్నారు సంబంధిత అధికారులు. అయితే ఇటీవలిగా ఈ విధానం కొంత నెమ్మదించినట్లు వార్తలొస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో తడి-పొడి చెత్త నిర్వహణ సరిగా ఉండడంలేదని స్థానికులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో రిక్షాల ద్వారా సిబ్బంది చెత్త సేకరిస్తున్నారు. రిక్షాలలోనే తడిపొడి చెత్త వేర్వేరుగా సేకరించడానికి 80 లీటర్ల డబ్బాలు ఏర్పాటుచేశారు. వీటిలోనే చెత్తను వేయాలి. ఇంటి యాజమానుల దగ్గర ఉన్న నీలం డబ్బా పొడి చెత్తకు, ఆకుపచ్చ డబ్బా తడి చెత్తకు ఉపయోగించాల్సి ఉంటుంది. అదే రంగుల్లో రిక్షాలలో ఉన్న డబ్బాలలోనే తడి పొడి చెత్తను వేయాల్సి ఉంటుంది. అయితే తడి చెత్త కంటే పొడి చెత్త అధికంగా వస్తుండటంతో రిక్షా కార్మికులు రెండు కలిపి తీసుకెళ్తున్నారని అంతా అంటున్నారు.

 

కార్పోరేషన్ అధికారులు తడి, పొడి చెత్త సేకరణ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఈ కార్యక్రమంగా సమర్ధవంతంగా సాగడంలేదు. పొడి చెత్త కేంద్రాలు దూరంగా ఉండటం, తడి, పొడి చెత్త సేకరించి.. ఐదారు డివిజన్లకు ఒకచోటా ఉన్న చెత్త కలెక్షన్‌ పాయింట్ల దగ్గర ఉన్న డంపర్‌బిన్స్‌లో పోస్తున్నారు. ఇక్కడ కూడా రెండు డంపర్‌బిన్స్‌ ఏర్పాటు చేసినా ఫలితం ఉండటం లేదని సమాచారం. దీనికి తోడు తడి చెత్తను వర్మీ కంపోస్టు యార్డులకు తరలించడం లేదని అంతా అంటున్నారు. తడి చెత్తను, పొడిచెత్తను వేరు చేయడం ద్వారా ఎప్పటికప్పుడు ఏ చెత్తను ఆ చెత్త వినియోగించుకునే అవకాశాన్ని అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. చెత్త సేకరణ సమయంలోనే వ్యర్థాలను గ్రేడ్ చేయడం ద్వారా నగరంలో దుర్గంధాన్ని నివారించవచ్చని అనుకున్నారు. ఇక డంపింగ్‌యార్డుకు వచ్చే చెత్తలో 80 శాతం తగ్గిపోతుందని భావించారు. అయితే ఈ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరడంలేదు. దీంతో తడి-పొడి చెత్త నిర్వహణ అధికారులను తలనెప్పిగా పరిణమించింది.

Related Posts