YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు పొలిటికల్ వైరస్

చంద్రబాబు పొలిటికల్ వైరస్

చంద్రబాబు పొలిటికల్ వైరస్
విశాఖపట్నం ఏప్రిల్ 18
చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన 40 ఏళ్ల పొలిటికల్ వైరస్. కరోనా వైరస్ కొన్ని నెలల తర్వాత అయినా తగ్గుతుంది. చంద్రబాబు వైరస్ చాలా ప్రమాదకరమని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు జనతా కర్ఫ్యూ రోజు మనవడికి ఇంగ్లీష్ బోధన చేస్తున్న వీడియో చూశాం. కానీ ఆయన మాత్రం రాష్ర్టంలో పేద విద్యార్దులకు ఇంగ్లీష్ మీడియం రాకుండా కుట్రలు చేశారు. దీపాలు వెలిగించమంటే మీరు దీపం,  కొడుకు కొవ్వొత్తి, మనవడు టార్చ్ లైట్ పట్టుకున్నారు. మీ ఇంట్లోనే ఐక్యత లేదు, కానీ అఖిలపక్షం గురించి మీరు మాట్లాడతారని అయన అన్నారు. చంద్రబాబు చందాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. హుద్ హుద్ తుఫాన్ నుంచి రాజధాని నిర్మాణం వరకు చందాలు వసూలు చేసిన ఘనత మీదే. మిమ్మల్ని చందాల నాయుడు అని ఉంటే బాగుండేదేమో. మీరు, మీ పత్రికలు  కూడా పలు సందర్భాలలో చందాలు వసూలు చేసి ఎపుడైనా లెక్కలు చెప్పారా అని ప్రశ్నించారు. హుద్ హుద్ తుఫాన్ సమయంలో వెయ్యి కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని కేంద్రాన్ని మీరు కోరితే 600 కోట్లు ఇస్తే,  అందులో 200 కోట్ల రూపాయిలని కూరగాయలు కొనుగోలు చేశామని మీ హోంమంత్రి అసెంబ్లీలో దొంగలెక్కలు చెప్పలేదా. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన గబ్బిలం. విశాఖలో కరోనా కేసులు దాచిపెడుతున్నామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు చేస్తున్నారు అయ్యన్నకి మందు దొరక్క ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. విశాఖలో పాజిటివ్ కేసులు దాచాల్సిన అవసరం ఏముంది. మీ నాయకుడి మెప్పుకోసం విశాఖపై తప్పుడు వ్యాఖ్యలు చేయవద్దు. యుద్దంలో గెలిచినా...ఓడినా వీరుడంటారు. కానీ ఆట మధ్యలో వెళ్లిపోయిన వారిని ఏమంటాం. ఆటలో అరటిపండు అంటాం. పవన్ కళ్యాణ్ చేసిన చేసిన విమర్శలు సైతం ఆటలో అరటి  పండులాంటివే. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి  వైయస్ జగన్ ఇచ్చిన పిలుపునకు ప్రజలు స్పందించి ఐకమత్యం ప్రదర్శించారు. దేశాన్ని కాపాడాలనే ప్రజల చిత్తశుధ్ది చూస్తే వారికి చేతులు జోడించి నమస్కరించాలని అనిపిస్తోంది. ప్రపంచాన్ని శాసిస్తామని చెప్పిన కొన్ని దేశాలు నేడు కరోనాతో వణికిపోతున్నాయి. 30 కోట్లు జనాభా ఉండే అమెరికా లాంటి దేశంలో నేటికి 6 లక్షల పైచిలుకు కేసులు నమోదయ్యాయని అయన అన్నారు. ఇటలీ ,జర్మనీ,స్పెయిన్ లాంటి దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. డబ్య్లు హెచ్ ఓ రిపోర్ట్ ప్రకారం మంచి వైద్యసేవలందించే ఇటలీ నేడు ఏ స్దితిలో ఉందో చూస్తున్నాం. ఇలాంటి పరిస్దితుల్లో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. దేశం ఆ రకంగా ఆదర్శంగా నిలిస్తే మన రాష్ట్రం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్  ఒంటిచేత్తో రాష్ర్టంలోని ప్రజలను కాపాడాలని చేస్తున్న ప్రయత్నాలు మనం చూస్తున్నాం. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధ వల్ల ఈరోజు ఏరకంగా ఆంధ్రరాష్ర్టంలో ప్రతి ఇల్లు జల్లెడపట్టి ఎక్కడ ఏ రకమైన పరిస్దితులు ఉన్నాయో తెలుసుకుని ఆయా కుటుంబాలకు సంబంధించి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.  వాటిని అధికారులకు తెలియచేసి ఆరోగ్యసేవలలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం ఏపి.  చంద్రబాబు మూడు లక్షల కోట్ల అప్పులతో రాష్ర్టాన్ని అప్పుల పాలు చేశారు.అయినప్పటికీ కూడా  వైయస్ జగన్  అండగా నిలబడి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి జగన్ కు  పబ్లిసిటి చేసుకోవాల్సిన అవసరం లేదు.మాది మేటర్ పీక్ పబ్లిసిటి వీక్. చంద్రబాబు గారిది మేటర్ వీక్ పబ్లిసిటి పీక్ అని చాలా సందర్భాలలో అసెంబ్లీలో సైతం చెప్పాం. అదే చంద్రబాబు  ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే మీడియావారికి ఖాళీ ఉండకపోదు. ప్రతి నిముషం ప్రెస్ మీట్, అధికారులతో సమీక్షలు,  సమావేశాలు, వాటిని ఆర్భాటాలు , హంగులు చేసుకుంటూ మార్కెటింగ్ చేసుకునే పరిస్ధితులు ఉండేవి. ప్రతిపక్షనేత  చంద్రబాబు చేస్తున్న విమర్శలు చూస్తుంటే బాధ అనిపిస్తోంది.ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచంలోగాని,దేశంలోగాని ఇతర రాష్ర్టాలలోగాని ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ఇంతలా ప్రభుత్వాన్ని విమర్శించిన దాఖలాలు ఎక్కడా లేవని అయన అన్నారు.

Related Posts