YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లాక్ డౌన్ ఎత్తివేత సరి బేసి వ్యవస్థ కొన్ని షరతులు

లాక్ డౌన్ ఎత్తివేత సరి బేసి వ్యవస్థ కొన్ని షరతులు

లాక్ డౌన్ ఎత్తివేత సరి బేసి వ్యవస్థ కొన్ని షరతులు
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 18 
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేసథ్యంలో దాన్ని విస్తరించకుండా అడ్డుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించాయి. అయితే మొదటి దశ లాక్ డౌన్ గడువు ముగిసే సమయానికి కరోనా కట్టడిలోకి రాకపోవడంతో ...మరోసారి మే 3 వరకు లాక్ డౌన్ ను పొడగిస్తునట్టు మోడీ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కరోనా ఎక్కువగా ఉన్నప్పటికీ  ఒక్క కేసు కూడా నమోదు కానీ చాల ప్రాంతాలలో కూడా ఉన్నాయి. దీనితో  ఈ ప్రాంతాలలో లాక్ డౌన్ ఎత్తివేసే దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలను సిద్ధం చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో కేరళ రాష్టంలో కూడా ఏప్రిల్ 20 తరువాత కొన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాంతాలలో కూడా కొన్ని షరతులు అమలులో ఉంటాయి అని తెలుస్తుంది. కేరళలోని కొన్ని జిల్లాల్లో ఏప్రిల్ 20 తర్వాత ఈ విధానాన్ని అమలు చేస్తామని కేరళ ముఖ్యమంత్రి ప్రకటించారు. సరి బేసి వ్యవస్థ అమలుకు ముందు కొన్ని షరతులు కూడా విధించనున్నారు. ఈ విధానంలో మహిళలకు మినహాయింపు ఉండే అవకాశం ఉంది. కరోనా వైరస్ కేసులు లేని జిల్లాల్లో మాత్రమే బేసి - సరి విధానం అమలు చేయబడుతుంది. ఈ విధానం ప్రకారం బేసి సంఖ్య నెంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలు బేసి రోజులలో మరియు సరి సంఖ్య నెంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలు సరి రోజులలో రోడ్డు మీదకి రావచ్చు.అయితే  ఈ సరి బేసి విధానాన్ని ఏ జిల్లాల్లో అమలు చేయాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు. దీని కోసం రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే కరోనా కేయూస్లు నమోదైన జిల్లాల్లో మే 3 వరకు లాక్ డౌన్ పాటించాల్సిందే. ఇలాంటి వ్యవస్థను కొద్ది రోజుల క్రితం తమిళనాడులో ప్రకటించారు. సరి బేసి  లాంటి విధానానికి సమానమైన కలర్ కోడింగ్ పథకాన్ని తమిళనాడులో అమలు చేశారు. ఈ కలర్ కోడింగ్ విధానంలో ప్రతి వాహనానికి కూడా కలర్ వేస్తారు. వారి వాహనం కలర్ ను బట్టి .. ఆ వాహనానికి కేటాయించిన  రోజున మాత్రమే బయటకు రావడానికి అవకాశం ఉంటుంది.  ఈ నిబంధన పాటించకుండా వాహనాలపై రోడ్డు మీదకి వస్తే  జప్తు చేయబడతాయి. అలాగే వారి పై కఠిన చర్యలు తీసుకుంటారు.

Related Posts