YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మద్దతు ధర లేక పరేషాన్‌

మద్దతు ధర లేక పరేషాన్‌

శనగ కొనుగోళ్లపై సర్కార్ పరిమితులు విధించడంతో ఆదిలాబాద్ రైతుల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఒక రైతు నుంచి 20క్వింటాళ్ల సరకునే సేకరించాలన్న నిబంధన విధించింది. దీంతో మిగిలిన పంటను ప్రైవేట్ వ్యాపారులు లేదా దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని పలువురు రైతులు వాపోతున్నారు. బయటి వ్యక్తులు ఎలాగూ తక్కువ ధరే చెల్లిస్తారు. దీంతో కర్షకులకు పెద్దగా లాభంలేని పరిస్ధితి నెలకొంది. వాతావరం కొంత అనుకూలంగానే ఉండడంతో రైతులు ఎకరానికి 8-10 క్వింటాళ్ల చొప్పున దిగుబడి సాధించగలిగారు. పంట ఆశాజనకంగా ఉండడంతో ఆశించినంతగానే పైకం చేతికందుతుందని భావించారు. అయితే వారి ఆశలను నీరుగార్చుతూ ప్రభుత్వం కొనుగోళ్లపై ఆంక్షలు విధించింది. ఈ తరహా కండిషన్లతో రైతులు నష్టపోయే అవకాశముందని అంతా అంటున్నారు.

 

ఆదిలాబాద్ వ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 37వేల ఎకరాల్లో శనగ పంట సాగు చేశారు. అనుకూల వాతావరణానికి తోడు సాగుకు 24 గంటలు విద్యుత్తు సరఫరా ఉండడంతో వ్యవసాయక్షేత్రాలను నీరు సమృద్ధిగా అందింది. దీంతో దిగుబడులు పెరిగాయి. పంట ఆశాజనకంగా ఉందన్న ఆనందం రైతులకు ఎంతోకాలం నిలువలేదు. కోతలు ప్రారంభంకాగానే ఉన్నట్టుండి ధర తగ్గడం మొదలైంది. దీంతో కర్షకులు ప్రభుత్వ కొనుగోళ్లపైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.4,400 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో క్వింటాలు ధర రూ.3400 మాత్రమే వస్తోంది. గత ఏడాది ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.5 నుంచి 6వేల లోపు చెల్లించారు. దీంతో రైతులు బయటి వ్యాపారులకు అమ్ముకున్నారు.. ఈ ఏడాది దీనికి వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి. ధర గణనీయంగా క్షీణించిపోవడంతో సర్కార్‌ కొనుగోళ్లపైనే రైతులు ఆధారపడ్డారు. ఈ అంశాలు గ్రహించి రైతులకు మేలు జరిగేలా కొనుగోళ్లపై విధించిన ఆంక్షలు తొలగించాలని రైతు సంఘాల నేతలు విజ్ఞప్తిచేస్తున్నారు.

Related Posts