క్వారంటైన్ కు వెళ్ళడానికి నిరాకరణ
శ్రీకాళహస్తి ఏప్రిల్ 18
శ్రీకాళహస్తిలో అధికార యంత్రాంగానికి విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేయడానికి అధికార యంత్రాంగం పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లోని చుట్టుపక్కల కుటుంబాల వారిని గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం తో పాటు క్వా రం టైన్ కేంద్రంలో కి పంపించడానికి ఏర్పాటు చేశారు. పట్టణంలోని నగాచ్చా పాలెం, పూసల వీధి ప్రాంతాల లో గుర్తించిన కుటుంబాలను పంపేందుకు అధికారులు ప్రయత్నించగా, కొందరు తీవ్రంగా వ్యతిరేకించి అధికారులతో వాగ్వాదానికి దిగారు. తాము అక్కడికి వెళ్ళమని, ఇంట్లోనే ఉంటామని భీష్మించారు. ఒక దశలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో తాసిల్దార్ జరీనా బేగం, డి ఎస్ పి నాగేంద్రుడు, సి ఐ నాగార్జున రెడ్డి కుటుంబాల తో చర్చలు జరిపారు. దీనిపై ప్రతిష్టంభన నెలకొనడంతో జిల్లా కలెక్టర్ ఎస్పీ కి సమాచారం పంపించారు.పట్టణ పరిధిలో 61 మంది ని గుర్తించి వారిని పంపించాలని అధికారులు తొలుత భావించినప్పటికీ 19 మంది ముందుకు రాగా, మిగిలిన వారు వ్యతిరేకించడంతో అందరనీ మోటివేషన్ చేసి వారిలోనూ అవసరమైన వారిని మాత్రమే పంపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మత పెద్దలను పిలిచి చర్చలు జరుపుతున్నారు. ఎవరు కూడా అనవసరమైన ఆందోళన చెందవద్దని క్వా రం టైన్ కేంద్రంలో తగిన వసతులు కల్పించబడుతుంది అని, ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో క్వా రం టైన్ లోనూ అలాగే ఉంటుందని అధికారులు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.