YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విదేశీయం

కరోనాకి  కేంద్ర బిందువుగా వుహాన్‌ వైరాలజీ ల్యాబ్ ఫై  అమెరికా నిఘా  

కరోనాకి  కేంద్ర బిందువుగా వుహాన్‌ వైరాలజీ ల్యాబ్ ఫై  అమెరికా నిఘా  

కరోనాకి  కేంద్ర బిందువుగా వుహాన్‌ వైరాలజీ ల్యాబ్ ఫై  అమెరికా నిఘా  
వుహాన్‌ నగర శివారులో కొండ ప్రాంతంలో దాదాపు 3 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో దీనిని నిర్మించారు. ఇక వైరస్‌లపై వదంతులు నమ్మకూడదంటూ.. ‘‘నివారణ, నియంత్రణ ముఖ్యం. ఎవరూ భయపడవద్దు. అయితే పూర్తి భద్రత నడుమ ఈ ల్యాబ్‌ను నిర్వహిస్తున్నామని చైనా చెబుతుంటే.. అమెరికా మాత్రం వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా లీకైందని వాదిస్తోంది ప్రస్తుతం ప్రపంచమంతా ఆరోగ్య, ఆర్థిక సంక్షోభానికి కారణమైన కరోనా వైరస్‌(కోవిడ్‌-19) గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది. మానవాళి మనుగడకు సవాలుగా పరిణమించిన ప్రాణాంతక వైరస్‌ పుట్టుక, వ్యాప్తికి కారణమైందంటూ చైనాపై పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మహమ్మారి జన్మస్థానంగా భావిస్తున్న వుహాన్‌ నగరంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వుహాన్‌లోని వైరాలజీ సంస్థలోనే కరోనా పురుడు పోసుకుందంటూ కోకొల్లలుగా కథనాలు వెలువడుతున్నాయి. కానీ చైనా శాస్త్రవేత్తలు మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు. మాంసం మార్కెట్ల నుంచే కరోనా వ్యాప్తి చెందిందని.. జంతువుల నుంచే మనిషికి సోకిందని చెప్పుకొస్తున్నారు. 

Related Posts