YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

రామాయణం.....

రామాయణం.....

రామాయణం.....
రామాయణంలో రాముడి ద్వారా సమాజాన్ని చూపించారు వాల్మీకి. అటువంటి రామాయణం లోనూ ఎవరో ఏదో అన్నారనో సీతమ్మను అరణ్యవాసానికి పంపించడంలో ఎటువంటి ధర్మం ఉంది అని చాలా మంది అనుకొంటారు.. 
చాలా కాలంగా రామాయణంపై జరుగుతున్న చర్చల్లో వస్తున్న ప్రశ్న ఇది. రాముడి మనసులో సీతమ్మ మీద అసలు అనుమానం లేనే లేదు. బాగా ప్రేమ ఎక్కడ ఉంటుందో.. అక్కడ వచ్చే ఆలోచన ఏంటంటే.. అవతల వారు మానసింగా ఎదుర్కొనేటు వంటి సంఘర్షణ ఇవతలి వారు అనుభవిస్తారు. సీతమ్మ మీద అనుమానం ఉంటే రాముడు ఆమెను అయోధ్యకు తీసుకెళ్లే ప్రయత్నమే చేయడు.. కానీ, లోకం సరైంది కాదు.. ఏది పడితే అది మాట్లాడేస్తుంది. అయోధ్యకు వెళ్లిన తర్వాత ఎవడో ఒకడు ఏదో అంటే.. సీతమ్మ చాలా బాధ పడుతుంది. ఆమెను ఎవ్వరూ ఏమీ అనకూడదనీ, ఆమె అలా బాధ పడకూడదనీ.. సీతమ్మను అగ్ని ప్రవేశం చేయించారు. అగ్నిహోత్రుడు ఆమెను మహా పతివ్రత అన్నారు. ఉత్తరకాండలో సీతమ్మను పరిత్యజించడానికి ముందు ఒక గూఢచారి వచ్చి సీతమ్మను ఇలా అంటున్నారని రామునితో చెప్పాడు. రాముడు వెంటనే నిర్ణయం తీసుకోలేదు. మిత్రులతో మీరేం అనుకుంటున్నారని అడిగాడు. మిత్రులు కూడా గూఢచారి చెప్పిన మాటకు అనుకూలంగానే మాట్లాడారు. అప్పుడు రాములవారు.. ఇది "ఇవ్వాళ ఇక్కడి వరకు వచ్చింది. ఆమె గర్భవతి. ఈ మాట రేపు అంతఃపురానికి వస్తుంది. చెలికత్తెలు ఏం మాట్లాడుకుంటున్నా.. నా గురించేనేమో అని సీత అనుకొని బాధపడుతుంది. మానసికంగా కుంగి పోతే సంతానం తేజోవంతంగా ఎలా పొంద గలుగుతుందని" ఆలోచించాడు రాముడు. ఆమె ప్రశాంతంగా ఉండి సంతానం కనాలని వనాలకు పంపించాడు.సీతారాములు రెండు కాదు ఒక్కటే అని సీతమ్మే చెప్పింది. రామాయణం సహృదయంతో అర్థం చేసుకుంటే.. రాముడెప్పుడూ సీతమ్మను వదిలిపెట్టేయలేదన్న విషయం మనకు దృఢంగా అర్థమవుతుంది. అందుకే సీతమ్మ భూమిలోకి వెళ్లిపోతే.. రాముడు సరయూలోకి వెళ్లిపోయాడు. ఇంక రాముడు సీతమ్మను వదిలేశాడన్న ప్రశ్నే రాదు. అందుకే నేటికీ కొన్ని వేల సంవత్సరాల తరబడి మన హిందూ సనాతన ధర్మమున ప్రతి పెళ్లిపత్రికలపై సీతారాముల చిత్రాలు వేసి, వారి శ్లోకాలను అచ్చు వేయిస్తారు...
|| ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణేనమః ||

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts