YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

అష్టాంగ హృదయం సంగ్రహణం

అష్టాంగ హృదయం సంగ్రహణం
అష్టాంగ హృదయం సంగ్రహణం
*సనాతన ఆరోగ్య సూత్రములు:*
*1.భోజనాగ్రే సదా పధ్యం, లవణార్ద్రకభక్షణమ్,*
  *రోచనం దీపనం వహ్ని, జిహ్వాకంఠ విశోధనమ్.*
తా: భోజనాత్పూర్వము అల్లము, సైంధవలవణము కలిపి నమిలి తినిన జీర్ణశక్తి వృద్ధిచెందుతుంది. గొంతు నాలుక పరిశుద్ధమై, రుచి కలుగుతుంది.
*2.భుక్త్వా శతపదం గచ్ఛేత్, శనై స్తేన తు జాయతే,*
*అన్నసంఘాతశైథిల్యం, గ్రీవాజానుకటీసుఖమ్.*
*భుక్తోపవిశత స్తుందం, శయానస్య తు పుష్టతా,*
*ఆయు శ్చంక్రమమాణస్య, మృత్యు ర్ధావతి ధావతః*
తా: భోజనానంతరము నూరడుగులు నడచిన అన్నము యుక్తస్థానమున చేరి, మెడ, నడుము, మోకాళ్లు వీటియందు సుఖము కలుగును.భుజించిన తోడనే కదలక కూర్చున్నచో పొట్ట పెరుగును; పండుకొన్న వారికి కొవ్వు పెరుగును; మెల్లగా అటునిటు తిరిగిన ఆయుర్వృద్ధి కలుగును; పరుగెత్తినచో ఆయుఃక్షీణము.
*3.భుక్త్వా శతపదం గచ్చేత్, తాంబూలం తదనంతరమ్,*
*వామపార్శ్వే తు శయనం, ఔషధై: కిం ప్రయోజనమ్.*
తా:  భోజనానంతరము నూరడుగులు నడచి, తదనంతరము తాంబూలసేవనము చేసి, ఎడమవైపున శయనించుచో యిక ఔషధము లెందుకు? (ఆరోగ్యవంతుడై యుండునని భావము.)
*4.అనాత్మవంతః పశువత్ భుంజతే యోఽప్రమాణతః,*
*రోగానీకస్య తే మూలమ్, అజీర్ణం ప్రాప్నువంతి హి.*
తా: ఎవరైతే మిత మనేది లేకుండా ఎల్లప్పుడూ ఎదో ఒకటి నములుతూ ఉంటారో వారు అజీర్ణవ్యాధికి గుఱి అవుతారు. అజీర్ణమే  సర్వరోగములకును మూలము. (మానవులు ఆ యా వేళలయందే మితముగా భుజించవలెను.)
*5.భుంజానో న బహు బ్రూయాత్, న నిందేదపి కంచన,*
*జుగుప్సికధాం నైవ, శృణుయాదపి ఆ వతెత్.*
తా: భోజనసమయమున అధికముగా మాట్లాడరాదు. పరనిందా ప్రసంగము అసలే కూడదు. కధాప్రసంగములు  చేయరాదు, విననూ రాదు..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Related Posts