YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

నెట్టింట్లో విద్యాభ్యాసం

నెట్టింట్లో విద్యాభ్యాసం

నెట్టింట్లో విద్యాభ్యాసం
హైద్రాబాద్, ఏప్రిల్ 20,
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయి. దాంతో విద్యార్థులు, అధ్యాపకులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. దాదాపు ప్రీ స్కూల్ నుంచి పిజి వరకు అన్ని తరగతులు ఆన్‌లైన్‌లో బోధిస్తున్నారు. ప్రీ స్కూల్, నర్సరీ, ఎల్‌కెజి, యుకెజి విద్యార్థులు స్మార్ట్‌ఫోర్ల ద్వారానే రైమ్స్, ఇతర సాంగ్స్ వింటూ కొత్త అంశాలను నేర్చుకుంటున్నారు. కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంటర్నెట్‌లో పలు యాప్‌ల ద్వారా క్లాసులు భోధిస్తూ హోంవర్కులు ఇస్తున్నాయి. వాటిని చూసి తల్లిదండ్రులు పిల్లలతో రాయించడం, చదివించడం చేస్తున్నారు. మరికొన్ని పాఠశాలలు ప్రత్యేక యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ బోధన కొనసాగిస్తున్నారు. అలాగే పదవ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో, టివిల్లో పునశ్చరణ తరగతులు అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ మార్గనిర్ధేశం చేస్తున్నారు.ఆన్‌లైన్‌లో పుస్తకాలను అందిస్తున్న సంస్థలన్నీ వాటి సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించాయి. అమెజాన్ బుక్స్, కేంబ్రిడ్జ్ బుక్స్ లాంటి సంస్థలతో ప్రపంచంలోని దాదాపు అన్ని సంస్థలు ఆన్‌లైన్‌లో పుస్తకాలు చదువుకునేందుకు చార్జీలు వసూలు చేయడం లేదు. పిల్లలు ఇష్టపడే పలురకాల చిత్రాలను కూడా ప్రఖ్యాత సంస్థలు ఉచితంగా అందిస్తున్నాయి. అందులో అమర్‌చిత్రకథ లాంటి వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి.పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగిస్తున్నారు. మొబైల్ డేటాను అన్ చేసి ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఆన్‌లైన్ షాపింగ్‌లు, నగదు చెల్లింపులతోపాటు అన్ని రకాల బిల్లులు, బ్యాంకు ఖాతాల లావాదేవీలను సైతం ఇంటర్‌నెట్ ద్వారానే చేస్తున్నారు. రకరకాల పుస్తకాలు, గ్రంథాలు కూడా ఇంటర్నెట్‌లో లభిస్తుండటంతో వాటిపై ఆసక్తి చూపుతున్నారు. ఇక పిల్లలైతే వివిధ రకాల గేమ్స్‌తో పాటు కార్టూన్లు, పాటలు, సినిమాలు, ఇతర వీడియోలు చూస్తూ సరదాగా గడిపేస్తున్నారు.లాక్‌డౌన్‌కు ముందు 60 శాతం మంది ఇంటర్‌నెట్‌ను వినియోగించగా, ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ప్రెవేట్ కంపెనీలు, ఐటి సెక్టార్లలో పనిచేసే ఉద్యోగులు ఆల్‌లైన్‌లోనే వర్క్ ఫ్రం హోంe ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. బయటకు వెళ్లకుండా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బు చెల్లించి నిత్యావసర సరుకులను సైతం తెప్పించుకుంటున్నారు. అయితే కొందరు ఉద్యోగులు, వ్యాపారులు తమ కార్యకలాపాలను ఇంటినుంచే ఇంటర్‌నెట్ ద్వారా సాగిస్తున్నారు. మరి కొందరు కాలక్షేపం కోసం మొబైల్ ఇంటర్నెట్‌ను వినియోగిస్తూ సినిమాలు, పాటలు, వార్తలు వింటూ గడుపుతున్నారు. దీంతో నెట్ వినియోగం భారీగా పెరిగింది. లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నెట్‌ ఖర్చు రెట్టింపు అయిందని వివిధ మొబైల్ కంపెనీల ఏజెన్సీలు చెబుతున్నాయి.
 

Related Posts