YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎడీబీ అధికారులను కలిసిన మేయర్ ప్రతినిధి బృందం !!

ఎడీబీ అధికారులను కలిసిన మేయర్ ప్రతినిధి  బృందం !!

గ్రేటర్ హైదారాబాదులో మౌలిక స‌దుపాయాల‌ కల్పన కు ఆర్డిక సహాయాన్ని అందించాలని కోరుతూ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేతృత్వం లో రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారుల బృందం న్యూ డిల్లీ లో నేడు ఆసియా అభివృద్ది బ్యాంక్ ఉన్నాతాదికారులను కలిసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రం లో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిలో ప్రధానంగా మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, టీ- ఫైబర్, డబుల్ బెడ్‌రూం ఇళ్ల‌ నిర్మాణం, ఎస్ఆర్డీపీ తదితర కార్యక్రమాలు ఉన్నాయని ఏడీబీ అడికారులకు వివరించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె టీ ఆర్ ఆదేశాల మేరకు న్యూ డిల్లీ  లొని ఆసియా అభివృద్ది బ్యాంకు అధికారులను మేయర్ రామ్మోహన్ తో పాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యడర్శి అరవింద్ కుమార్, పరిశ్రమలు, ఐటీ శాఖ ముక్య కార్యదర్శి జయెశ్ రంజన్ లు సమావేశ మయ్యారు. ఎడీబీ న్యూ డిల్లీ మిషన్ డైరెక్టర్ యొకొయమా తో సమాయెశమై  తెలంగాణా లో ముక్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కాల్పనా రంగం లో చెపటీన పలు పధకాలను వివరించారు. ప్రడానంగా సిగ్నల్ ఫ్రీ ప్రయాణనీకీ  చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ది కార్యక్రమం,  హైదరాబాద్ మెట్రో రైల్,  లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్ల‌ నిర్మాణం, మూసి సుంద‌రీక‌ర‌ణ‌ ప్రాజెక్ట్ పనులు తదితర కార్యక్రమాలను మేయర్ రామ్మోహన్ వివరించారు. పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థ‌లు  కూడా హైదరాబాద్ నగరాన్ని ప్రపoచం లొనే ఉత్తమ నివాసయొగ్యమైన నగరంగా ప్రకటించిన విషయాన్ని మేయర్ ఈ సందర్భంగా ఎడీబీ అడికారులకు గుర్తుచేశారు. త్వరలొనె ట్రామ్ రైల్ ను కూడా చెపట్టన్నున్నామని చెప్పారు. కాగా, త్వరలోనే  హైదరాబాద్ నగరాన్ని సందర్శించిన  అనంతరం ఆర్డిక సహాయాని అందించేందుకు సానుకూల నిర్ణయం టీసుకొనున్నట్టు ఎ డీ బీ ఇండియన్ మిషన్ హెడ్ యొకొయమా మేయర్ రామ్మోహన్ బృందానికి తెలుపారు.

Related Posts