YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

అకడమిక్ ఇయర్ ఆలస్యమేనా

అకడమిక్ ఇయర్ ఆలస్యమేనా

అకడమిక్ ఇయర్ ఆలస్యమేనా
హైద్రాబాద్, ఏప్రిల్ 20
ఏటా జూన్లో విద్యాసంవత్సరం ప్రారంభం కావడం, ఏప్రిల్లో ముగియడం మామూలుగా జరుగుతుంటుంది. కానీ ఈ అకడమిక్ ఇయర్ ఏప్రిల్లో ముగిసేలా లేదు. వచ్చే అకడమిక్ ఇయర్ జూన్లో ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు. ప్రతి అకడమిక్ ఇయర్లో స్కూళ్లు, కాలేజీలు 220 రోజులు తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ అకడమిక్ ఇయర్ మాత్రం కరోనా ఎఫెక్ట్తో అది సాధ్యపడలేదు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో స్కూళ్లు, కాలేజీలకు బాగానే సెలవులు ఇచ్చారు. ఈసారి ఒంటిపూట బడులు ప్రారంభం కాకుండానే.. కరోనా ఎఫెక్ట్తో సెలవులు వచ్చేశాయి. దీంతో టెన్త్, ఇంటర్ మినహా మిగిలిన డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ తోపాటు ఇతర ప్రొఫెషనల్ కోర్సుల సిలబస్ పూర్తి కాలేదు. ఏప్రిల్ ఫస్ట్వీక్లో ఫస్ట్ క్లాస్నుంచి నైన్త్  క్లాస్ వరకున్న స్టూడెంట్స్కు ఎస్ఏ–2 ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉన్నా.. లాక్ డౌన్ నేపథ్యంలో సాధ్యపడలేదు. దీంతో ఆయా క్లాసుల్లోని సుమారు 52 లక్షల మంది స్టూడెంట్స్ను పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేసింది.రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ ఒకేషనల్, డిగ్రీ సెమిస్టర్స్, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్తో పాటు పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. టెన్త్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం మార్చి19 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగాల్సి ఉంది. కానీ మార్చి 21 వరకు ఫస్ట్, సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ మాత్రమే జరిగాయి. కరోనా కారణంగా, హైకోర్టు ఆదేశాలతో టెన్త్లోని మిగిలిన ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్వాయిదా పడ్డాయి. మరోపక్క ఇంటర్మీడియెట్ మెయిన్ సబ్జెక్టుల ఎగ్జామ్స్ అన్నీ పూర్తయినా.. ఇంటర్ ఒకేషనల్ మోడర్న్ లాంగ్వేజ్ పేపర్- 2, జియోగ్రఫీ పేపర్ -2 వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 4 నుంచి జరగాల్సిన పాలిటెక్నిక్ ఎగ్జామ్స్కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరగాల్సిన అంబేద్కర్  ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలతో పాటు అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ, పీజీ సెమిస్టర్స్, ఇంజినీరింగ్ సెమిస్టర్స్ వాయిదా పడ్డాయి. మార్చి19 నుంచి మార్చి 31 మధ్య జరగాల్సిన టెన్త్, 11, 12వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ వాయిదా వేసింది.రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కూడా కరోనా ఎఫెక్ట్తో వాయిదా పడ్డాయి. మే 2న ఈసెట్, మే 4 నుంచి జరగాల్సిన ఎంసెట్ ఎంట్రెన్స్తో పాటు ఐసెట్, పీఈసెట్, లాసెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్ పరీక్షలూ,  వీటితో పాటు డీసెట్, పాలిసెట్,  మోడల్ స్కూల్ఎంట్రెన్స్ ఎగ్జామ్, గురుకుల ప్రవేశాల పరీక్ష కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. జాతీయ స్థాయిలో జేఈఈ, నీట్తో పాటు పలు ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి.కరోనా కట్టడికి లాక్డౌన్ విధించడంతో రాష్ట్రంలోని 12 కేంద్రాల్లో ప్రారంభమైన ఇంటర్  స్పాట్ వాల్యుయేషన్ వాయిదా పడింది. మే ఫస్ట్వీక్లో ఇంటర్ వాల్యుయేషన్ ప్రారంభించినా.. గతంలో మాదిరిగా 12 కేంద్రాల్లో నిర్వహిస్తే మాత్రం రెండు నెలలు పడుతుంది. ఇంటర్ రిజల్ట్స్ ఆధారంగానే ఎంసెట్ రిజల్ట్స్, డిగ్రీ అడ్మిషన్లు ఉంటాయి.  జాతీయస్థాయి పరీక్షలనూ దృష్టిలో పెట్టుకొని రిజల్ట్స్ ప్రాసెస్ను వేగంగా నిర్వహించాల్సి ఉంది. మరోపక్క టెన్త్ ఎగ్జామ్స్మే చివరి వారంలో పెట్టినా.. జూన్చివరి వారం లేదా జులై ఫస్ట్వీక్లో రిజల్ట్స్ ఇచ్చే చాన్ ఉంటుంది. టెన్త్ రిజల్ట్స్పైనే ఇంటర్, పాలిటెక్నిక్ అడ్మిషన్లు ఆధారపడి ఉంటాయి. మే ఫస్ట్ వీక్ వరకూ కరోనా ప్రభావం తగ్గితేనే ఇదంతా జరిగేది. లేదంటే ఈ ప్రక్రియంతా మళ్లీ వాయిదా పడుతుంది.దేశవ్యాప్తంగా 4,800పైగా ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన సీహెచ్ఎస్ఎల్, జేఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 20 నుంచి 28 వరకు జరగాల్సిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (సీహెచ్ఎస్ఎల్) టైర్-1 ఎగ్జామ్స్, అదేవిధంగా మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగాల్సిన జూనియర్ ఇంజనీర్ (జేఈ)  టైర్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి. ఇండియన్‌‌‌‌ ఆర్మీ, నేవీ, ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌‌‌లో ప్రవేశాలకు సంబంధించిన నేషనల్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌ అకాడమీ (ఎన్‌‌‌‌డీఏ), నావెల్‌‌‌‌ అకాడమీ (ఎన్‌‌‌‌ఏ) పరీక్షలూ వాయిదా పడ్డాయి. నోటిఫికేషన్‌‌‌‌ ప్రకారం ఎన్‌‌‌‌డీఏ, ఎన్‌‌‌‌ఏ ఎగ్జామ్స్ ఏప్రిల్‌‌‌‌ 19న జరగాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్తో  పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు యూనియన్‌‌‌‌ పబ్లిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌ (యూపీఎస్సీ) ప్రకటించింది.

Related Posts