YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

కోవిడ్ లేని రాష్ట్రంగా గోవా

కోవిడ్ లేని రాష్ట్రంగా గోవా

కోవిడ్ లేని రాష్ట్రంగా గోవా
పానాజీ, ఏప్రిల్ 20
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఆదివారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు 10 శాతం కంటే ఎక్కువ నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 552, గుజరాత్‌లో 367, ఉత్తరప్రదేశ్‌లో 179 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 17,325కు చేరుకుంది. దేశంలో గత 24 గంటల్లో 1,612 కేసులు నమోదు కాగా.. ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో నమోదు కావడం ఇదే తొలిసారి. ఆదివారం ఒక్క రోజే మరో 39 మంది కరోనాకు బలయ్యారు. వీరిలో అత్యధికంగా మహారాష్ట్రలో 12 మంది, గుజరాత్ 10, మధ్యప్రదేశ్ 5, తెలంగాణ మూడు, ఢిల్లీ, రాజస్థాన్, కేరళలో ఇద్దరు చొప్పున ఉన్నారు. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్-19తో మృతిచెందినవారి సంఖ్య 569 దాటింది.ఇదిలా ఉండగా.. కరోనా రహిత రాష్ట్రంగా గోవా నిలచింది. ఈ రాష్ట్రంలో ఏడుగురికి కరోనా సోకగా వారంతా కోలుకుని ఇళ్లకు వెళ్లారు. గత 14 రోజుల నుంచి ఇక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో దేశంలోనే తొలి కరోనా రహిత రాష్ట్రంగా గోవా రికార్డులకెక్కింది. ఢిల్లీలో ఆదివారం కొత్తగా 110 కేసులు నిర్ధారణ కాగా.. మొత్తం సంఖ్య 2,003కి చేరింది. మొత్తం 71 కంటెయిన్‌మెంట్ జోన్‌లను గుర్తించిన ఢిల్లీ ప్రభుత్వం.. మరింత పటిష్ఠ చర్యలు ప్రారంభించింది. లాక్‌డౌన్ మినహాయింపుల్లేవని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. సురక్షిత ఢిల్లీ తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఒడిశాలో కొత్త కేసులు నమోదు చాలా నిలకడగా ఉంది. ఇప్పటి వరకూ అక్కడ 60 మందికి మాత్రమే వైరస్ నిర్దారణ అయ్యింది. వైరస్‌పై పోరాటంలో భాగంగా మేజిస్ట్రేట్ అధికారాలతో గ్రామ సర్పంచ్‌లను సమయాత్తం చేసింది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 4,200కి చేరింది. మొత్తం 223 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసుల్లో మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాతి స్థానంలో (1,743) నిలిచింది. మొత్తం 63 మంది ఇప్పటి వరకూ అక్కడ మృతిచెందారు. ఒక్క అహ్మదాబాద్‌లోనే పాజిటివ్ కేసులు 1,101కు చేరుకున్నాయి. ఆదివారం మొత్తం 367 కేసులు నమోదు కాగా.. అహ్మదాబాద్‌లోనే 239 మంది వైరస్ సోకింది. ఉత్తరప్రదేశ్‌లోనూ కేసులు 1,000 దాటాయి. ఆదివారం 177 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం కేసులు 1,163కు చేరాయి.మధ్యప్రదేశ్‌లో మాత్రం కొత్త కేసుల్లో ఆదివారం కొంత సానుకూలత కనిపించింది. కేవలం ఐదుగురి మాత్రమే వైరస్ నిర్ధారణ కాగా.. పలు జిల్లాలోనే వైరస్ నెగెటివ్ రేటు పెరగడం విశేషం. కేరళలో మరో ఇద్దరికి వైరస్ సోకగా.. మొత్తం కేసులు 400 దాటాయి. మరో 13 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా.. ఇంకా 129 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో 49, ఆంధ్రప్రదేశ్‌లో 44 కేసులు నమోదయ్యాయి. అలాగే తెలంగాణలో ముగ్గురు, ఏపీలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో మొత్తం కేసులు 858కి, ఏపీలో 647కి చేరుకున్నాయి. తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు 1,000కిపైగా నమోదయిన రాష్ట్రాలు ఏడుకి చేరాయి. మహారాష్ట్ర 4,200, ఢిల్లీ 2,003, గుజరాత్ 1,763, రాజస్థాన్ 1,478, తమిళనాడు 1,477, మధ్యప్రదేశ్ 1,407 ఉత్తరప్రదేవ్ 1,100.. అలాగే మహారాష్ట్రలో అత్యధికంగా 223 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ 72, గుజరాత్ 63, ఢిల్లీ 45, తెలంగాణ 21, యూపీ, ఏపీ 17 ఉన్నాయి.

Related Posts